![]() |
![]() |

తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతో మంది హీరోలు ఉన్నారు. ఆయా హీరోల సినిమా రిలీజ్ అవుతుంటే పలానా హీరో అని చెప్పుకుంటాం. కానీ శర్వానంద్(Sharwanand)ని మాత్రం హీరో శర్వానంద్ అని చెప్పుకుంటాం. రెండు దశాబ్డల నుంచి తనదైన నటనతో తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంటు ముందుకు దూసుపోతున్నాడు. లేటెస్ట్ గా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఆర్ ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ (karthikeya)అప్ కమింగ్ మూవీ భజే వాయు వేగం bhaje vaayu vegam)ఈ నెల 31 న విడుదల కానుంది. తాజాగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిపింది.చీఫ్ గెస్ట్ గా శర్వానంద్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా కార్తికేయ, శర్వానంద్ ని కొన్ని ప్రశ్నలు అడిగాడు. రామ్ చరణ్(ram charan)అన్న, ప్రభాస్ (prabhas)అన్న ఒకేసారి ఫోన్ చేస్తే ముందుగా ఎవరిని కలుస్తారు అని అడిగాడు. ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా చరణ్ దగ్గరికి ఫస్ట్ వెళ్తాను, ఆ తర్వాత ప్రభాస్ ని కలుస్తానని శర్వా బదులిచ్చాడు. ఇప్పుడు శర్వా చెప్పిన ఈ మాట టూ డే టాక్ ఆఫ్ ది డే గా నిలిచింది. ఎందుకంటే చరణ్, ప్రభాస్ లాంటి సూపర్ స్టార్స్ గురించి అలాంటి ప్రశ్న వస్తే సమాధానం చెప్పటానికి ఎవరైనా తడపడతారు. కానీ శర్వా మాత్రం వెంటనే ఎలాంటి తడబాటు లేకుండా చరణ్ ని ఫస్ట్ కలుస్తానని చెప్పాడు. దీంతో మరోసారి చరణ్ కి శర్వా కి మధ్య ఉన్న అనుబంధం అందరికి తెలిసింది. ఇద్దరు చిన్నప్పటినుంచి స్నేహితులు. పైగా చరణ్ తో పాటే వాళ్ళ ఇంట్లో పెరిగాడు. చిరంజీవే చాలా సందర్భాల్లో ఈ విషయాన్నీ చెప్పాడు.
.webp)
ఇక క్రికెటర్స్ లో ఎవరని ఎక్కువగా ఆరాధిస్తారని కూడా కార్తికేయ అడిగాడు. కింగ్ కోహ్లీ (kohli)తన ఆల్ టైమ్ ఫేవరెట్ క్రికెటర్ అని వెల్లడించాడు. రోహిత్ శర్మ బయోపిక్ చేస్తావా అనే ప్రశ్న వస్తే జీవితంలో క్రికెట్ ఆడను కాబట్టి నో అనే ఆన్సర్ ఇచ్చాడు. భజే వాయు వేగం విజయవంతమవ్వాలని శర్వా అభిలషించడం తో పాటు మూవీ టీం కి ఆల్ ది బెస్ట్ చెప్పాడు.ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యు వి క్రియేషన్స్ లో వస్తున్న భజే వాయువేగం కి ప్రశాంత్ రెడ్డి (prashant reddy) దర్శకుడు. ఆయనకిదే తొలి సినిమా. ఐశ్వర్య మీనన్ (Iswarya Menon)హీరోయిన్.
![]() |
![]() |