![]() |
![]() |

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తన 109వ సినిమాని బాబీ కొల్లి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. 'అఖండ', 'వీరసింహ రెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా కావడంతో 'NBK 109'పై భారీ అంచనాలే ఉన్నాయి. ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఫిల్మ్ లో బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు.
మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా 'NBK109' నుండి చిత్ర బృందం ఫస్ట్ గ్లింప్స్ విడుదల కాగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. "సింహం నక్కల మీదకు వస్తే వార్ అవ్వదురా లఫూట్.. ఇట్స్ కాల్డ్ హంటింగ్" అంటూ పవర్ ఫుల్ డైలాగ్ తో బాలయ్య గూస్ బంప్స్ తెప్పించాడు. త్వరలోనే ఈ సినిమా నుంచి మరో సర్ ప్రైజ్ రాబోతుంది. జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా చిత్ర టైటిల్ ను రివీల్ చేయడంతో పాటు, స్పెషల్ గ్లింప్స్ ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. నిర్మాత నాగవంశీ సైతం తాజాగా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ప్రీ రిలీజ్ ఈవెంట్ మాట్లాడుతూ.. జూన్ 10న 'NBK109' అప్డేట్ రానుందని తెలిపాడు. మొత్తానికి బాలయ్య పుట్టినరోజున టైటిల్ తో కూడిన పోస్టర్ తో పాటు, స్పెషల్ గ్లింప్స్ రానుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి 'వీర మాస్' అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు సమాచారం.
ఎస్.థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, 'జైలర్' ఫేమ్ విజయ్ కార్తీక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఎడిటర్ గా నిరంజన్, ప్రొడక్షన్ డిజైనర్ గా అవినాష్ కొల్లా వ్యవహరిస్తున్నారు.
![]() |
![]() |