![]() |
![]() |

ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. వాటి పేర్లు కూడా చాలా విచిత్రంగా ఉంటున్నాయి. రోగాలు ఏ ఒక్కరి సొంతమో కాదన్నట్టుగా కూడా పరిస్థితి ఉంది. సినీ నటులు కూడా అందుకు అతీతులు కాదు. చాలా మంది హీరోలు హీరోయిన్లు మేము పలనా వ్యాధి బారిన పడ్డామని స్వయంగా ప్రకటించారు. రీసెంట్ గా ఫాహద్ ఫాజిల్(Fahadh Faasil)కూడా నేను ఒక అరుదైన వ్యాధి బారిన పడ్డానని వెల్లడించాడు.
అటెన్షన్ డెఫిసీట్ హైపర్ యాక్టీవ్ డిజాస్టర్ తో ఫాహద్ బాధపతున్నాడు.పేరు చెప్పడానికే నోరు తిరగడం లేదంటే ఆ వ్యాధి భారిన పడ్డ ఫాహద్ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఏకాగ్రత లేకపోవడం, హైపర్ యాక్టివ్ ,హైపర్ ఫోకస్ వంటి లక్షణాలు వస్తాయి. అంటే చేసే పనిని అత్యుత్సాహం తో చెయ్యటం, పని అవ్వకపోతే ఒత్తిడికి గురవ్వడం, కోపం కూడా చాలా వేగంగా రావడం జరుగుతుంది. ఒక్కోసారి ఆ స్థాయి కూడా అదుపు తప్పుతుంది. అదే విధంగా అవసరం లేకపోయినా ప్రతి విషయాన్నీ చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. దీని వల్ల కూడా కోపం వచ్చే అవకాశం ఉంది.
ఫాహద్ ప్రస్తుతం అల్లు అర్జున్ (allu arjun)హీరోగా వస్తున్న పుష్ప 2 లో విలన్ గా చేస్తున్నాడు. పుష్ప 1 లో కొద్దీ సేపే కనపడి ప్రేక్షకులని మెస్మరైజ్ చేసిన ఫాహద్ పుష్ప 2 (pushpa 2) లో తన నటవిశ్వరూపాన్ని చూపించబోతున్నాడు. ఇటీవల తన సొంత భాష మలయాళంలో సోలో హీరోగా ఆవేశం(aavesham)మూవీతో సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. తెలుగులో కూడా ఓటిటి రిలీజ్ అయ్యి మంచి ప్రేక్షకాదరణని పొందింది. ఇక ఫాహద్ తన కున్న వ్యాధిని బహిరంగంగా చెప్పడం మంచి పనే అయ్యింది. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం పుష్ప సినిమా వల్ల తనకి ఏమి పేరు వచ్చింది లేదని చెప్పాడు. దీంతో బన్నీ ఫాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు చాలా మంది ఆశ్చర్య పోయారు. ఇప్పుడు తన కున్న వ్యాధిని ప్రస్తావించడంతో దాని వల్ల వచ్చిన ప్రాబ్లమ్ తో ఆ విధంగా మాట్లాడాడని సరిపుచ్చుకుంటున్నారు.
![]() |
![]() |