![]() |
![]() |
.webp)
తెలుగు సినిమా దర్శక, నిర్మాతలు కొత్త కాన్సెప్ట్ తో , ఫ్రెష్ కంటెంట్ తో ముందుకొస్తున్నారు. తాజాగా థియేటర్లలో రిలీజైన కొన్ని సినిమాలు ఆకట్టుకున్నాయి. అందులో కొన్ని సస్పెన్స్ థ్రిల్లర్ అయితే మరికొన్ని హారర్ కామెడీ, ఫ్యామిలీ డ్రామా జానర్ సినిమాలున్నాయి.
సినిమా ఇండస్ట్రీలో కొత్తనటీనటులతో వచ్చిన సినిమాలు కొన్ని భారీ విజయమే సాధించాయి. అయితే కంటెంట్ ఫ్రెష్ ఉంటుంటే.. కథనాన్ని ఆసక్తికరంగా మలచగలిగితే హిట్ అయినట్టే అని కొందరు కొత్త దర్శకులు కొత్త కంటెంట్ తో వస్తున్నారు. అలా రాబోతుందే ' నమో ' సినిమా. సర్వైవల్ కామెడీ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీ తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ మూవీలో అనురూప్ కటారి, విశ్వం దుద్దంపూడి, విస్మయ ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీనేత్ర క్రియేషన్స్, ఆర్మ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ప్రశాంత్ ఈ మూవీని నిర్మించారు. ఆదిత్య రెడ్డి కుందూరు దర్శకుడు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేశారు మేకర్స్. జూన్ 7 థియేటర్లలో ఈ సర్వైవల్ కామెడీ మూవీ రిలీజవ్వనుంది.
ఓ అడవిలో జంతువులని వేటాడుతూ బ్రతికే ఆదివాసుల తెగ ఉంటుంది. అదే అడవిలోకి ఇద్దరు యువకులు ట్రెక్కింగ్ కి వెళ్తారు. అనుకోకుండా ఆదివాసుల గుప్లిట్లోకి ఈ యువకులు వెళ్తారు. మరి వారి నుండి హీరో అతని ఫ్రెండ్ సర్వైవ్ అయ్యారా లేదా అనేది మిగతా కథ. రీసెంట్ గా రిలీజైన టీజర్ కామెడీగా ఉంది. మరి జూన్ మొదటి వారంలో వస్తున్న ఈ సినిమాని థియేటర్లలో చూసేయ్యండి.
![]() |
![]() |