![]() |
![]() |

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (allu arjun) అప్ కమింగ్ మూవీ పుష్ప 2 (pushpa 2) ఈ మూవీకి ముందు ఆగస్టు 15 డేట్ కి ఉన్న స్పెషల్ ఏంటని అడిగితే.. ఇది కూడా ఒక ప్రశ్ననా.. ఆ రోజు ఇండియాకి స్వాతంత్రం వచ్చిన రోజు అని చెప్తారు. కానీ ఇప్పుడు పుష్ప 2 కూడా ఉందిగా అని అంటున్నారు. అంతలా పుష్ప 2 భారతీయుల్లో భాగమయ్యిపోయింది. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న ఒక న్యూస్ పుష్ప రేంజ్ ని చెప్తుంది
పుష్ప 2 రిలీజ్ టైం దగ్గర పడే కొద్దీ అన్ని ఏరియాల బిజినెస్ లో కూడా వేగం పెరిగింది. నార్త్ అమెరికాలో సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. ఏకంగా 60 కోట్ల మేర బిజినెస్ పూర్తి చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఏ హీరో సినిమాని చూసుకున్నా కూడా ఇదే హయ్యస్ట్ ఫిగర్.. మరి ప్రభాస్ కల్కి ఎంత బిజినెస్ చేసుకుందో తెలియాలి.అంతే కాకుండా తెలుగు రాష్ట్రాల తో పాటు ఓటిటి హక్కులు, నార్త్ ఇండియా మార్కెట్ లో కూడా కనీ వినీ ఎరుగని రీతిలో బిజినెస్ చేసుకుంది. వాటి వివరాలు త్వరలోనే బయటకి రానున్నాయి.
ఇక పార్ట్ 1 హిట్ కావడంతో పార్ట్ టూ పై అందరిలోను భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే పుష్ప 2 ఎప్పటికప్పుడు సరికొత్త హంగులతో ముస్తాబవుతు వస్తుంది. యానిమల్ తో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన త్రిప్తి డిమ్రి (tripti dimri)బన్నీ తో కలిసి పుష్ప 2 కి సంబంధించిన ఐటెం సాంగ్ లో చిందులేయనుంది. రష్మిక మందన్న హీరోయిన్ గా అనసూయ భరద్వాజ్, ధనంజయ, సునీల్, రావు రమేష్, ఫహాద్ ఫాసిల్ తదితరులు కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన పుష్ప సాంగ్ అయితే సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తుంది. సుకుమార్ దర్శకుడు గా వ్యవహరిస్తున్నాడు
![]() |
![]() |