![]() |
![]() |

జబర్దస్త్ తో తెలుగు ప్రజల అభిమాన నటుడుగా మారిన హీరో గెటప్ శ్రీను(getup srinu)హీరో అని ఎందుకు అంటున్నానంటే రీసెంట్ గా రాజు యాదవ్ తో సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నిన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్స్ లో విడుదలయ్యింది.మరి కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం
రాజు యాదవ్ (raju yadav) తొలి ఆట నుంచే బాగుందనే టాక్ సంపాదించుకుంది. రాజు యాదవ్ క్యారక్టర్ లో గెటప్ శ్రీను సూపర్ గా నటించాడని కొన్ని సీన్స్ లో కన్నీళ్లు కూడా తెప్పించాడనే మాటలు ప్రేక్షకుల దగ్గరనుంచి వినిపిస్తున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి తొలి రోజు ఎనభై ఐదు లక్షలు సాధించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆంధ్ర సీడెడ్ లో కలుపుకొని నలబై ఏడు లక్షలు, నైజాం లో నలభై లక్షలు రాబట్టింది. మౌత్ టాక్ తో ఈ కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది. అలాగే మూవీ చూసిన వారందరు థియేటర్స్ లోనే రాజు యాదవ్ ని చూడండంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు

గెటప్ శ్రీను సరసన నూతన కధానాయిక అంకిత కారత్ చెయ్యగా వకీల్ సాబ్ ఫేమ్ ఆనంద్ చక్రపాణి ,నమని ప్రశాంత్ లు ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రశాంత్ రెడ్డి, రాజేష్, స్వాతి లు కలిసి సంయుక్తంగా నిర్మించగా కృష్ణమా చారి రచనా దర్శకత్వాన్ని అందించాడు.సురేష్ బొబ్బిలి, సంగీతాన్ని అందించగా చంద్రబోస్, కాకర్ల శ్యాం సాహిత్య రచన చేసారు
![]() |
![]() |