![]() |
![]() |

వెబ్ సిరీస్ : తలైమై సేయలగం
నటీనటులు: కిషోర్, శ్రీయా రెడ్డి, ఖుస్రుతి, భరత్, రమ్య నంబీషన్, ఆదిత్య మీనన్ తదితరులు
ఎడిటింగ్: రవికుమార్
మ్యూజిక్: గిబ్రాన్
సినిమాటోగ్రఫీ: రవిశంకరన్
నిర్మాతలు: రాధిక శరత్ కుమార్
దర్శకత్వం: వసంతబాలన్
ఓటీటీ: జీ5
కథ:
తమిళనాడు రాజకీయాలలో పెనుసంచలనంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా అరుణాచలం(కిషోర్) ఉంటాడు. అరుణాచలంకి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉంటారు. ఇద్దరు కూతుళ్లకు వివాహం అవుతుంది. పెద్ద కూతురు అముదవల్లి (రమ్య నంబీషన్) తండ్రితో పాటు రాజకీయాలలో చురుకైన పాత్రను పోషిస్తుంటుంది. చిన్న కూతురు ఆనందవల్లి ఇంటి పట్టునే ఉంటుంది. అయితే ఆమె భర్త హరిహరన్ మాత్రం ఇల్లరికం వచ్చేసి, రాజకీయాలలో తిరుగుతూ ఉంటాడు. ఇక అరుణాచలం మేనకోడలు సప్తమి ఆ ఇంట్లోనే ఉంటూ చదువుకుంటూ ఉంటుంది.అరుణాచలంతో కొట్రవై ( శ్రీయా రెడ్డి) మంచి సంబంధాలను కలిగి ఉంటుంది. వాళ్ల బంధాన్ని గురించిన ఒక సందేహం మాత్రం చాలామందిలో ఉంటుంది. కొట్రవై కూతురు 'మాయ' ఈ వార్తలు విని ఉండటం వలన, ఆమె తన తల్లిని అపార్థం చేసుకుంటుంది. ఆమెకి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తుంటుంది. ఇక సమయం చూసి అరుణాచలాన్ని దెబ్బతీయడానికి అతని శత్రువులైన కృష్ణమూర్తి - రంగరాజన్ ఎదురుచూస్తుంటారు. దుర్గ (ఖుస్రుతి) తరచూ కొట్రవైని కలుస్తుంటుంది. షిప్ యార్డ్ లో ఉన్న తన కంటేనర్ ను బయటికి తీసుకురావడానికి ముఖ్యమంత్రి ద్వారా హెల్ప్ చేయమని కోరుతుంటుంది. అందుకు కొట్రవై అంగీకరించకపోవడంతో కోపంతో రగిలిపోతుంది. దుర్గ గతం గురించి తెలుసుకున్న డీఎస్పీ మణికందన్ ( భరత్) .. సీబీఐ ఆఫీసర్ నవాజ్ (ఆదిత్య మీనన్) ఆమె కోసం గాలిస్తూ ఉంటారు. అరుణాచలంపై ఉన్న అవినీతి కేసు ఏమిటి? కుట్రవై గతం ఎలాంటిది? దుర్గ ఎవరు? ఆమెతో కొట్రవైకి ఉన్న సంబంధం ఎలాంటిది? అధికారం కోసం అరుణాచలం పెద్ద కూతురు ఏం చేస్తుంది? ఆయన చిన్నల్లుడు ఎలాంటి ప్లాన్ వేసాడనేది మిగతా కథ.
విశ్లేషణ:
పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే వెబ్ సిరీస్ అయిన సినిమా అయిన జనాలని ఆకర్షిస్తుంటుంది. ఎందుకంటే అవి నిజజీవితంలోని రాజకీయ నాయకుల కథలు కాబట్టి. తమిళనాడులో రాజకీయాలు ప్రతీ సంవత్సరం ఉత్కంఠభరితంగా సాగుతుంటాయి. వాటినే ప్రధానంగా చేసుకొని సాగే కథ ఇది.
కథ మొదలవ్వడమే ఒక సస్పెన్స్ తో మొదలవుతుంది. అక్కడి నుండి చివరి వరకు కథ అదే ఇంటెన్స్ తో కొనసాగుతుంది. వసంతబాలన్ రాసుకున్న కథని అంతే గిస్ర్పింగ్ తో తెరకెక్కించాడు. ప్రజలకు మంచి చేయాలనే ముఖ్యమంత్రికి తన కుటుంబసభ్యులే వెన్నుపోటు పొడవాలనుకోవడం ఓ వైపు ఉంటే... మరోవైపు అతణ్ణి ఆ సీటు నుంచి దింపేయాలని సరైన టైమ్ కోసం శత్రువులు చూస్తుంటారు. ముఖ్యమంత్రి జైలుకు వెళ్తే తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని కుటుంబసభ్యులు మోసాలకు పాల్పుతుంటారు. ఇలా ఈ కథ అనేక కోణాల్లో అనేక మలుపులతో కొనసాగుతుంది.
స్క్రీన్ ప్లే ఈ సిరీస్ కి హైలైట్ గా నిలిచింది. ప్రధానంగా కన్పించే పాత్రలు సహజంగా నటించారు. ఆ పాత్రలను చివరివరకూ నడిపించిన విధానం మెప్పిస్తుంది. అనవసరమైన సన్నివేశాలు ఎక్కడ కనిపించవు. చివర్లోని ట్విస్టులు ఈ సిరీస్ కి అదనపు బలాన్ని సమకూర్చాయి. తెరవెనుక జరిగే రాజకీయాలు, రంగులు మార్చే మనుషులను వాస్తవానికి దగ్గరగా చూపించారు. రాజకీయాలకి సంబంధించిన సన్నివేశాలను, ఫ్యామిలీ ఎమోషన్స్ తో ముడిపెట్టడం వలన ఆడియన్స్ కి ఎక్కడ బోర్ అనిపించదు. ఫైట్స్ లో కాస్త రక్తపాతం కన్పిస్తుంది. దానిని కాస్త స్కిప్ చేస్తే బాగుంటుంది. అడల్ట్ సీన్లు లేవు. ఫ్యామిలీతో కలిసి చూసేలా మేకర్స్ ఈ సిరీస్ ని మలిచారు. గిబ్రాన్ మ్యూజిక్ బాగుంది. రవిశంకరన్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. రవికుమార్ ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
అరుణాచలం పాత్రలో కిషోర్ ఒదిగిపోయాడు. ఆముదవల్లిగా రమ్య నంబీషన్, కొట్రవై గా శ్రీయా రెడ్డి, దుర్గగా ఖుస్రుతి, మణికందన్ గా భరత్, నవాజ్ గా ఆదిత్య మీనన్ తమ పాత్రలకి న్యాయం చేశారు.
ఫైనల్ గా : థ్రిల్ ని పంచే ఈ పొలిటికల్ డ్రామా వర్త్ వాచింగ్.
రేటింగ్ : 2.75 / 5
✍️. దాసరి మల్లేశ్
![]() |
![]() |