![]() |
![]() |

పుష్పరాజ్ కోసం శ్రీవల్లి 'సామి సామి' అని పాడితే.. దేశం మొత్తం ఊగిపోయింది. ఇప్పుడు శ్రీవల్లి మరోసారి పుష్పరాజ్ కోసం 'సామి' అంటూ పాడటానికి సిద్ధమైంది. ఈసారి కూడా 'సామి' సాంగ్ ఇండియాని షేక్ చేసేలా ఉంది.
'పుష్ప-1' విజయంలో సంగీతం కీలక పాత్ర పోషించింది. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలన్నీ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయ్యాయి. అందుకే 'పుష్ప-2' (Pushpa 2) సాంగ్స్ పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన 'పుష్ప పుష్ప' సాంగ్ ఆకట్టుకుంది. ఇప్పుడు రెండో సాంగ్ కి ముహూర్తం ఖరారైంది.
'పుష్ప-2' నుంచి సెకండ్ సింగిల్ గా 'ది కపుల్ సాంగ్'(సూసేకి) రాబోతుంది. ఈ సాంగ్ ని మే 29 ఉదయం 11:07 కి విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ అనౌన్స్ మెంట్ వీడియోని విడుదల చేశారు మేకర్స్. ఆ వీడియోలో సినిమా షూటింగ్ కోసం రష్మిక (Rashmika Mandanna) మేకప్ వేసుకుంటుండగా.. బ్యాక్ గ్రౌండ్ లో కేశవ(జగదీష్) వాయిస్ వినిపిస్తుంది. ''ఓ శ్రీవల్లి వదినా.. పుష్ప-2 నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ చేస్తా ఉండారు అంట గదా.. ఆ పాట ఏందో చెప్తావా" అని కేశవ అడగగా.. "సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి" అంటూ వినిపించిన సాంగ్ బిట్ కి రష్మిక అదిరిపోయే ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. సాంగ్ వినిపించింది ఐదు సెకన్లే కానీ.. వినగానే నచ్చేసేలా ఉంది. చూస్తుంటే.. 'సామి సామి' సాంగ్ మాదిరిగానే ఈ సాంగ్ కూడా విడుదల కాగానే చార్ట్ బస్టర్ అయ్యేలా ఉంది. కొందరు నెటిజన్లు అయితే "29 దాకా ఆగలేకపోతున్నాం సార్.. త్వరగా రిలీజ్ చేయండి." సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

అల్లు అర్జున్ (Allu Arjun) టైటిల్ రోల్ లో సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'పుష్ప-2'లో రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీస్ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం స్వాతంత్ర దినోత్సవం కానుకగా 2024 ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |