![]() |
![]() |

ప్రస్తుతం 'దేవర', 'వార్ 2' సినిమాలతో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR).. తన తదుపరి చిత్రాన్ని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఆగస్టు నుంచి ఈ మూవీ షూటింగ్ మొదలు కానుందని ఇటీవల ప్రకటించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా చకచకా జరుగుతున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ గా రష్మికా మందన్న (Rashmika Mandanna) పేరును ఖరారు చేసినట్లు సమాచారం.
'పుష్ప-1'తో పాన్ ఇండియా హీరోయిన్ గా అవతరించింది రష్మిక. గతేడాది డిసెంబర్ లో 'యానిమల్'తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆమె.. ఈ ఆగస్టులో 'పుష్ప 2'తో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే 'రెయిన్ బో', 'ది గర్ల్ ఫ్రెండ్', 'కుబేర' వంటి సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. ఇక ఇప్పుడు ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్ రూపంలో భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.
సౌత్, నార్త్ అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా రష్మికకు మంచి గుర్తింపు ఉంది. ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్.. భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ కావడంతో.. హీరోయిన్ గా రష్మికను ఎంపిక చేసినట్లు సమాచారం. అదే జరిగితే.. ఎన్టీఆర్, రష్మిక కాంబినేషన్ లో రానున్న మొదటి సినిమా ఇదే అవుతుంది.
![]() |
![]() |