![]() |
![]() |
.webp)
భగవంతుడి చూపు మనుషుల మీదే కాదు సమస్త జీవరాశుల మీద ఉంటుంది. ఇళయరాజా సంగీతం కూడా అంతే మనుషులకి మాత్రమే సొంతం కాదు. సమస్త జీవరాశులకి సొంతం. ఈ మాట అబద్దమని నిరూపించడం ఆ భగవంతుడి వల్ల కూడా కాదు. సంగీత సినీ ప్రపంచంలో ఎన్నో సరికొత్త బాణీలని పరిచయం చేసి అందరి హృదయాల్లో నిత్యం అమృత ధార ప్రవహించేలా చేసాడు. అంతటి కీర్తి సంపాదించిన సంగీత శిఖామణి కి తాజాగా ఒక అరుదైన గౌరవం లభించింది
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్. షార్ట్ కట్ లో చెప్పుకోవాలంటే ఐఐటీఎం. తమిళనాడు మొత్తం మీద ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇన్‌స్టిట్యూట్. 1956 లో స్థాపించారు. ఎన్నో గొప్ప గొప్ప ఫ్యాకల్టీలని ఈ ఇనిస్టిట్యూట్ అందిస్తుంది. ఇక్కడ చదువుకోవాలని ఎంతో మందో ఆశ పడతారు. ఇప్పుడు ఇందులో ఇళయరాజా సంగీత పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు.అంటే ఆయన సంగీతం మీద పరిశోధన జరగనుంది. ఇది సంగీత ప్రపంచానికే గర్వంగా భావించవచ్చు.పైగా ఇండియాలో ఇదే మొట్ట మొదటి సారి. సెంటర్ ఫర్ మ్యూజిక్ లెర్నింగ్, రీసెర్చ్ కేంద్రం పేరుతో ఏర్పాటు అయ్యే ఈ కేంద్రానికి త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి, ఇళయరాజా లు శంకుస్థాపన చేశారు

ఇళయ రాజా ఇప్పటివరకు వెయ్యి సినిమాలకి దాకా సంగీతాన్ని అందించాడు. ఎనిమిది వేల పాటలకి స్వర రచన చేసాడు. ప్రతి పాట కూడా ఒక అధ్బుతమే. గుణ, చంటి, జగదేక వీరుడు అతిలోక సుందరి, ధర్మ క్షేత్రం, అశ్వమేధం, బొబ్బిలి రాజా, కొండవీటి దొంగ, నాయకుడు, అభినందన, మహర్షి, రాక్షసుడు, శివ, శ్రీరామరాజ్యం ఇలా చెప్పుకుంటు పోతే ఎన్నో సినిమాల్లో హిట్ పాటలని అందించాడు. ఆయన సంగీతం వల్ల సినిమా రేంజ్ పెరుగుతుంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఆయన సంగీతం వల్ల అట్టర్ ప్లాప్ సినిమాలు కూడా యావరేజ్ గా నిలిచాయి
![]() |
![]() |