![]() |
![]() |

అదృష్టం నేను పలానా టైం కి వస్తున్నాని చెప్పి హింట్ ఇవ్వదు. సినిమా ఇండస్ట్రీలో కూడా అదే యాటిట్యూడ్ ని చూపిస్తుంది. ఫలితంగా యంగ్ ఏజ్ లో సత్తా చాటుదామని అనుకుంటే మిడిల్ ఏజ్ లో సత్తా చాటే పరిస్థితి వస్తుంది. ఈ కోవలో చేరిన నటి శ్రియా రెడ్డి . రీసెంట్ గా కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు అవి హాట్ టాపిక్ గా మారాయి.
శ్రియా రెడ్డి గత సంవత్సరం చివర్లో ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ లో ఒక ముఖ్య పాత్రని పోషించింది.రాధా రమ క్యారక్టర్ లో ఆమె పండించిన పెర్ఫార్మెన్సు కి పాన్ ఇండియా ప్రేక్షకులు మొత్తం ఫిదా అయ్యారు. గూగుల్ లో తన గురించి ఎంక్వయిరీ కూడా చేసారంటే శ్రియా ప్రభావాన్ని అర్ధం చేసుకోవచ్చు.ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో సలార్ షూటింగ్ అప్పటి విషయాలు గురించి మాట్లాడుతు షూటింగ్ టైం లో ప్రతిరోజు ప్రశాంత్ నీల్ కి నా పాత్ర ప్రాధాన్యత విషయంలో ఒత్తిడి చేసేదాన్ని.సహజంగా పెద్ద సినిమాలో భాగమైతేనే సంతృప్తిగా అనిపిస్తోంది. కానీ ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్స్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఉండాలనే దాన్ని.పైగా సెట్ లోకి వెళ్లే ముందే ప్రశాంత్ తో ఏ సమయంలో ఎలా మాట్లాడాలో అని ముందే ప్రిపేర్ అయ్యేదాన్ని. కానీ, ప్రశాంత్ కి సెట్స్‌లో డైలాగ్స్ రాసే అలవాటు ఉంది. అలా రాసేటపుడు తనని హత్య చేయాలనిపించేది అంటు సరదాగా కామెంట్స్ చేసింది.
.webp)
ఇక్కడ ఒక్క విషయం మాత్రం నిస్సందేహంగా చెప్పవచ్చు. రాబోయే సినీ రోజులన్నీశ్రియా రెడ్డి వే. పవర్ స్టార్ ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ ఓజి లోను చేస్తుంది. పైగా పవన్ ని ఢీ అంటే ఢీ కొట్టే క్యారక్టర్ లో చేస్తుంది. మొన్న జరిగిన ఎన్నికల్లో పవన్ గెలవాలని స్టేట్ మెంట్ కూడా ఇచ్చింది. ఇక మరొకొన్ని భారీ సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. చెన్నై కి చెందిన శ్రీయ రెడ్డి ఫస్ట్ మూవీ రాజా హీరోగా వచ్చిన అప్పుడప్పుడు. 2003 లో ఆ మూవీ విడుదల అయ్యింది. ఆ తర్వాత శర్వానంద్ తో అమ్మ చెప్పింది లోను చేసింది. పలు మలయాళ తమిళ చిత్రాల్లోను నటించింది. ప్రముఖ హీరో విశాల్ అన్నయ్య విక్రమ్ కృష్ణ ఆమె భర్త. జి కె ఫిలిం కార్పొరేషన్ పై పలు చిత్రాలని నిర్మించాడు
![]() |
![]() |