![]() |
![]() |
.webp)
అల్లు అర్జున్ బుట్టబొమ్మ ఎవరంటే అందరు వెంటనే పూజాహెగ్డే అని చెప్తారు. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ముంబై లో కూర్చొని సూపర్ స్టార్ కృష్ణ ,శోభన్ బాబు ల హిట్ మూవీ ఇద్దరు మిత్రులు లోని ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి అనే పాట పాడుకుంటుంది. ఇది నూటికి నూరుపాళ్లు నిజం
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ముకుంద తో ఎంట్రీ ఇచ్చిన పూజా కెరీర్ ప్రారంభం లో భారీ హిట్ లని సాధించింది. చాలా మంది అగ్ర హీరోల దర్శకుల మొదటి ఛాయస్ పూజా నే. దాన్నిబట్టి ఆమె హవా ఏ స్థాయిలో సాగిందో అర్ధం చేసుకోవచ్చు. టాప్ హీరోయిన్ అనే టాగ్ లైన్ తో ఇతర హీరోయిన్లకి అసూయని కూడా కలిగించింది. కానీ 2022 లో ఎవరి దిష్టి తగిలిందో గాని వరుసగా డిజాస్టర్ మూవీస్ ని తన ఖాతాలో వేసుకుంది.దాంతో ఐరన్ లెగ్ అనే బ్రాండ్ ని చాలా ఈజీ గానే సొంతం చేసుకుంది. దాంతో తన పూర్వ వైభవాన్ని సంపాదించడం కోసం నిరీక్షిస్తూ ఉంది.ఇప్పుడు తన ఎదురు చూపులు ఫలించాయి. సూర్య నటించబోయే 44వ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయినట్టు వార్తలు వస్తున్నాయి.
నెక్స్ట్ మంత్ జూన్ 2 న ఆ మూవీ ప్రారంభం కాబోతోందనే టాక్ కూడా వినపడుతుంది. పర్యావరణానికి సంబంధించిన ఒక సోషల్ మెసేజ్ తో కూడిన కథ అని తెలుస్తుంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకుడు. తండేల్ తర్వాత నాగ చైతన్య చేయబోయే మూవీలో కూడా పూజా దాదాపుగా కన్ఫార్మ్ అయినట్టే. ఈ రెండింటితో పాటు షాహిద్ కపూర్ మూవీ దేవాలో కూడా తనే. ఈ విషయం మీద అధికారకంగా ప్రకటన కూడా వచ్చింది. సో ఆ మూడు చిత్రాల ద్వారా పూజా హెగ్డే మళ్ళీ తన హవా ని కొనసాగించవచ్చు
![]() |
![]() |