![]() |
![]() |
దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు, ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘కల్కి 2898ఎడి’. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ భారీ సినిమా జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. 22 భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. పాన్ వరల్డ్ మూవీగా రిలీజ్ కాబోతున్న ‘కల్కి’ చిత్రం ప్రమోషన్‌ను త్వరలోనే స్టార్ట్ చేసేందుకు చిత్ర యూనిట్ కసరత్తు చేస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ఒక వార్త బయటకు వచ్చింది. ఇది ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ లాంటింది.
ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఫ్యాన్స్ మీట్ కూడా ఉండబోతోందనేది ఆ వార్త. ఈ ఈవెంట్‌లో ఫ్యాన్స్ అంతా ప్రభాస్‌కి బెస్ట్ విషెస్ చెబుతారు. వచ్చే వారం నుంచే ప్రభాస్ ‘కల్కి’ ప్రమోషన్స్‌లో పాల్గొంటాడని తెలుస్తోంది. ఈ సినిమాకి ప్రమోషన్స్‌ను విస్తృత స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సినిమా ప్రజల్లో ఎంత ఎక్కువగా వెళితే అంత ప్రయోజనం ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. అందుకే అన్నిరకాలుగా ప్రమోషన్ చేయబోతోంది. ఇందులో భాగంగానే నేషనల్ మీడియాకి కూడా స్పెషల్ ఇంటర్వ్యూలు ఇచ్చేలా ప్లానింగ్ చేస్తోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృషిస్తుందన్న కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు మేకర్స్.
![]() |
![]() |