![]() |
![]() |
.webp)
తెలుగు సినిమా అగ్ర హీరోల్లో పవన్ కళ్యాణ్ కూడా ఒకడు. తనదైన స్టైల్ తో, డాన్స్ తో, యాక్టింగ్ తో రెండున్నర దశాబ్దాల నుంచి ప్రేక్షకులని అలరిస్తు వస్తున్నాడు.అసలు ఆయన సినిమా రిలీజ్ అయిందంటే చాలు తెలుగునాట పండుగ వాతావరణం వస్తుంది. లక్షలాది మంది అభిమానులు ఆయన సొంతం. ఇప్పుడు అభిమానులు పవన్ కళ్యాణ్ హెల్త్ విషయంలో ఆందోళనలో ఉన్నారు
ఈ నెల 13 న ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న ఎన్నికల దృష్ట్యా పవన్ తన జనసేన పార్టీ తరుపున రాష్టం మొత్తం ప్రచారం చేస్తున్నాడు. అందులో భాగంగా నిన్న తిరుపతి వెళ్ళాడు. రేణిగుంట విమానాశ్రయంలో దిగిన పవన్ కి అభిమానులు,జనసేన పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ కుడి కాలి బొటన వ్రేలుకి ఒక కట్టు కనిపిస్తుంది.పైగా చాలా నెమ్మదిగా నడుచుకుంటూనే తన కాన్వాయ్ ని ఎక్కాడు.ఇదంతా గమనించిన అభిమానులు, జన సైనికులు పవన్ కాలికి ఏమైందని ఆరాతీస్తున్నారు. పార్టీ నుంచి కూడా గాయం గురించి ఎలాంటి ప్రకటన రాలేదు.దీంతో వాళ్లంతా కొంచం ఆందోళనలో ఉన్నారు
ఇక పవన్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన దగ్గరనుంచి విరామం లేకుండా ప్రచారంలో పాల్గొంటున్నాడు. పైగా ఎండలు కూడా మండుతున్నాయి.దీంతో హెల్త్ విషయంలో పవన్ జాగ్రత్తగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక పవన్ పిఠాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నాడు. పలువురు సినిమా హీరోలు ఇప్పటికే పవన్ కి ఓటు వేసి గెలిపించాలని ప్రజల్ని కోరుతున్నారు. చిరంజీవి, రామ్ చరణ్, నాని లాంటి స్టార్స్ ఆ వరుసలో ఉన్నారు. మరి కొంత మంది సినిమా వాళ్ళు కూడా రానున్న రోజుల్లో పవన్ కి ఓటు వెయ్యాలని కోరే అవకాశం ఉంది
![]() |
![]() |