![]() |
![]() |

ఏప్రిల్ 25న విడుదల కావాల్సిన 'ప్రతినిధి 2' సినిమా చివరి నిమిషంలో ఏవో కారణాల వల్ల మే 10కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం మే 10న కూడా విడుదల కావడం కష్టమేనని, సెన్సార్ సర్టిఫికెట్ రాలేదని ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారానికి తాజాగా మూవీ టీమ్ చెక్ పెట్టింది.
'ప్రతినిధి 2' చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చినట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. అలాగే, 136 నిమిషాల రన్ టైం లాక్ అయినట్లు తెలిపింది. తాజా ప్రకటనతో 'ప్రతినిధి 2' మళ్ళీ వాయిదా పడనుందన్న వార్తల్లో వాస్తవం లేదని తేలిపోయింది.

నారా రోహిత్ ప్రధాన పాత్రలో మూర్తి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ప్రతినిధి 2'. ఈ పొలిటికల్ ఫిల్మ్ ని వానర ఎంటర్టైన్మెంట్స్, రానా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి.
![]() |
![]() |