![]() |
![]() |

స్టార్ హీరోల సపోర్ట్ ఉంటే.. కుర్ర హీరోలు మరింత ఉత్సాహంగా పని చేసి, మరిన్ని మంచి సినిమాలు అందించే అవకాశం ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) రూపంలో.. యంగ్ హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ కి అలాంటి సపోర్టే దొరికింది. ఈ ఇద్దరు యంగ్ హీరోల గురించి తాజాగా ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ ఆకట్టుకుంటున్నాయి.
సోమవారం సాయంత్రం 'టిల్లు స్క్వేర్'(Tillu Square) మూవీ సక్సెస్ మీట్ జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. " సినిమా అంటే ఒక పిచ్చి ఉండేవారు పరిశ్రమలో చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో సిద్ధు మొదటి వరుసలో ఉంటాడు. తనకి సినిమా తప్ప వేరే ఏమీ తెలీదు. డీజే టిల్లు అనే పాత్రని చూసి అతను నిజ జీవితంలో కూడా అలాగే ఉంటాడని మీకు అనుకోవచ్చు. కానీ సిద్ధు అలా కాదు. ఎంతసేపూ తన సినిమా, తను చేస్తున్న పాత్ర, తను రాస్తున్న కథ, ఈ కథకి నేను న్యాయం చేస్తున్నానా లేదా అనే తపన ఉంటుంది. చాలా తక్కువమంది ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్స్ లో ఈ తపనను చూస్తాం మనం. సిద్ధు ఇలాగే కష్టపడాలి, కష్టపడుతూనే ఉండాలి. కష్టానికి కొలమానం లేదు. కష్టాన్ని ఇలాగే నమ్ముకో.. మరింత ఉన్నస్థాయికి వెళ్తావు. నేను సిద్ధుకి, విశ్వక్ కి చాలాసార్లు చెప్పాను. నాకు మీ ఇద్దరి మీద నమ్మకం ఉంది. భవిష్యత్ లో మీ ఇద్దరూ కొత్త ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడానికి ఇండస్ట్రీకి చాలా హెల్ప్ అవుతారు. ఇండస్ట్రీకి మీ ఇద్దరూ ఎంతో ఉపయోగపడతారని చాలాసార్లు వాళ్లకి చెప్పాను. ఇప్పుడు వాళ్ళిద్దరినీ ఇలా చూస్తుంటే.. చాలా గర్వంగా, చాలా ఆనందంగా ఉంది. కొత్త ఆలోచనలను ముందుకు తీసుకువెళ్ళడానికి ఇండస్ట్రీకి ఇలాంటి డేర్ డెవిల్స్ కావాలి." అని అన్నాడు.
![]() |
![]() |