![]() |
![]() |

తెలుగునాట ఎన్నో సాంప్రదాయ పండుగలు ఉన్నాయి. అవి ఎప్పుడెప్పుడు వస్తాయో తేదీలతో సహా క్యాలండర్ లో ఉంటాయి. కానీ ఒక్క పండుగ గురించి మాత్రం క్యాలండర్ లో లేదు. అదే సినీ పండుగ. అఫ్ కోర్స్ వాళ్ళ దృష్టికి ఆ వార్త వచ్చి ఉండదేమో. కానీ మీ కోసం మేము ఆ పండుగ విషయాన్నీ చెప్తున్నాము. జాగ్రత్తగా మీ క్యాలండర్ లో నోట్ చేసుకోండి.
తెలుగు సినిమా ప్రేక్షకులకి సెప్టెంబరు లాస్ట్ వీక్ తో ఫెస్టివల్ స్టార్ట్ అవ్వబోతుంది. దీనికి మొదటి ఆద్యుడుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిలవబోతున్నాడు. ఆయన నటించిన ఓజీ ఆ చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇందులో ఎలాంటి అనుమానం లేదు. నిర్మాత దానయ్య ఈ విషయాన్నీ పదే పదే చెప్తున్నారు. కూడా. ఇక అక్టోబరు 10 న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రెస్టేజియస్ట్ మూవీ దేవర రిలీజ్ కాబోతుంది. ఆ డేట్ లో కూడా ఎలాంటి మార్పు లేదు. అందుకోసం శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. ఇక అదే వారం సూర్య కంగువ కూడా రిలీజ్ కాబోతుంది. డేట్ అటు ఇటు అవుతుంది గాని రిలీజ్ మాత్రం సెకండ్ వీక్ నే.
అలాగే నాగచైతన్య అప్ కమింగ్ మూవీ తండేల్ కూడా అక్టోబరు రెండో వారాన్నే రానుంది.పైగా గీత ఆర్ట్స్ మూవీ కావడంతో అందులో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. కాకపోతే దేవర, కంగువ రెండో వారమే వస్తే బిజినెస్ దృష్ట్యా తండేల్‌ను తర్వాతి వారం రిలీజ్ చేస్తారు.ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ ల క్రేజీ మూవీ గేమ్ చేంజర్ కూడా అక్టోబరులోనే రిలీజ్ కాబోతుంది. నిర్మాత దిల్ రాజు ఈ విషయాన్ని ఎప్పుడో ప్రకటించాడు. రజనీకాంత్ వేట్టయాన్ కూడా అక్టోబరు చివరి రెండు వారాల్లో ఏదో ఒక డేట్‌కు రాబోతుంది. సో సెప్టెంబరు చివరి వారం నుంచి అక్టోబరు చివరి వరకు సినీ ప్రియులకి పండగే. పైగా అన్ని కూడా పాన్ ఇండియా సినిమాలే
![]() |
![]() |