![]() |
![]() |

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu arjun) పుట్టినరోజు(ఏప్రిల్ 8) సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఎందరో సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా బన్నీ విషెస్ చెబుతున్నారు. అయితే వాటిలో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) విషెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అల్లు అర్జున్, ఎన్టీఆర్ మధ్య ఎప్పటి నుంచో మంచి అనుబంధముంది. ఇద్దరూ ఒకరినొకరు బావ అని ప్రేమగా పిలుచుకుంటూ ఉంటారు. ఒకరు విజయాన్ని చూసి మరొకరు ఆనందిస్తుంటారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలపడం, అభినందించడం చేస్తుంటారు. ఈ క్రమంలో నేడు బన్నీ పుట్టినరోజు సందర్భంగా తారక్ ట్వీట్ చేశాడు. "పుట్టినరోజు శుభాకాంక్షలు బావా. ఇది నీకు సంతోషం, విజయంతో నిండిన సంవత్సరం కావాలని కోరుకుంటున్నాను." అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. ఇక ఆ ట్వీట్ కి బన్నీ రిప్లై ఇస్తూ "నీ లవ్లీ విషెస్ కి థాంక్యూ వెరీ మచ్ బావ" అన్నాడు. తారక్, బన్నీ మధ్య బాండింగ్ చూసి ఇరు హీరోల అభిమానుల మురిసిపోతున్నారు.

కాగా, అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా నేడు 'పుష్ప-2' టీజర్(Pushpa 2 Teaser) ని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.
![]() |
![]() |