![]() |
![]() |

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) పుట్టినరోజు(ఏప్రిల్ 8) కానుకగా నేడు 'పుష్ప-2' టీజర్(Pushpa 2 Teaser) విడుదలై సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. గంగమ్మ జాతరలో అర్ధనారీశ్వర రూపంలో దర్శనమిచ్చిన బన్నీని చూసి ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. ఇక ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న అనసూయ భరద్వాజ్(Anasuya).. టీజర్ చూసి షాకింగ్ కామెంట్స్ చేసింది.
"సార్! ఏంటిది?! ఆహా ఏంటిది అంట?! అలా కాలు తిప్పి, టైమింగ్ లో కొంగు పట్టి దోపి.. విదిలించి.. నడుస్తుంటే సార్" అంటూ టీజర్ చూసిన ఎక్సైట్ మెంట్ లో ట్వీట్ చేసిన అనసూయ.. అల్లు అర్జున్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం అనసూయ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
2021 డిసెంబర్ లో విడుదలై సంచలనం సృష్టించిన 'పుష్ప-1' కి కొనసాగింపుగా వస్తోంది ఈ చిత్రం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా రష్మిక మందన్న నటిస్తోంది. 'పుష్ప-1'లో దాక్షాయణి పాత్రలో ఆకట్టుకున్న అనసూయ.. 'పుష్ప-2' లోనూ అలరించనుంది. ఆగస్టు 15న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

![]() |
![]() |