![]() |
![]() |

తన 15వ సినిమా 'గేమ్ ఛేంజర్'(Game Changer)ను శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan).. 16వ సినిమాని 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఇటీవల గ్రాండ్ గా లాంచ్ అయింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పోషించనున్నట్లు తెలుస్తోంది.
'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ ఇమేజ్ రావడంతో రామ్ చరణ్ కొత్త సినిమాలన్నీ భారీ బడ్జెట్ తోనే రూపొందుతున్నాయి. #RC16 కూడా భారీస్థాయిలో రూపొందనుంది. ఈ మూవీ కోసం వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటీనటులను రంగంలోకి దింపుతున్నారు. ఇప్పటికే కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ ఈ చిత్రంలో ఓ పవర్ ఫుల్ లో నటించనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో కీలక పాత్ర కోసం అమితాబ్ ని రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఆయన రామ్ చరణ్ తాతయ్య పాత్రలో కనిపించనున్నారట.
సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.
![]() |
![]() |