![]() |
![]() |

హీరోయిన్లకి ఏంటండీ బాబు వాళ్ళు ఏమైనా కొనగలరు. ఈ మాట తరచుగా బయట వాళ్ళు అనుకుంటూ ఉంటారు. బహుశా హీరోయిన్లు కూడా వాళ్ళనుకున్న మాటలు వింటారేమో గాని తరచుగా ప్రాపర్టీస్ ని కొంటుంటారు. తాజాగా ఒక హీరోయిన్ ఆ పనే చేసింది. తనెవరో కాదు రాశి ఖన్నా. అందుకు సంబంధించిన డిటెయిల్స్ ఒకసారి చూద్దాం.
రాశి ఖన్నా హైదరాబాద్ లో ఒక ఇల్లు కొంది. ఇందులో పెద్ద విచిత్రం ఏముంది! హీరోయిన్ ఆ మాత్రం కొనదా ఏంటని అనుకోకండి. ఆమెకి ఇప్పటికే హైదరాబాద్ లో రెండు ఇల్లు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు మూడవ ఇల్లుని తీసుకుంది ఇటీవలే గృహా ప్రవేశం కూడా చేసింది. తన తల్లితండ్రులు, బంధువులతో కలిసి సాంప్రదాయ బద్దంగా వేడుకని కూడా జరుపుకుంది.అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నెటిజన్స్ ఆమెకి కంగ్రాట్స్ చెప్తున్నారు. కొంత మంది అయితే తనకి స్టార్ డం ఇచ్చిన తెలుగుకే ఆమె ప్రాముఖ్యత ఇస్తుందని మెచ్చుకుంటున్నారు.

2013 లో బాలీవుడ్ లో తెరకెక్కిన మద్రాస్ కేఫ్ తో ఆమె సినీ రంగ ప్రవేశం జరిగింది. ఆ తర్వాత 2014 లో వచ్చిన ఊహలు గుసగుసలాడే తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.అందానికి అందం, నటనకి నటన తోడవ్వడంతో ఇక వరుసగా పలు భారీ సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి. జిల్, బెంగాల్ టైగర్, సుప్రీం ,హైపర్, జై లవకుశ, రాజా ది గ్రేట్,వెంకీ మామ, తొలిప్రేమ, ప్రతి రోజు పండగే ఇలా 20 కి పైగా చిత్రాల్లో నటించింది. హిందీ, మలయాళ, తమిళ చిత్రాల్లోను మంచి సినిమాలే చేసింది. ఆమె స్వస్థలం ఢిల్లీ.ప్రస్తుతం తెలుసు కదా అనే మూవీలో చేస్తుంది. సిద్దు జొన్నలగడ్డ అందులో హీరో
![]() |
![]() |