![]() |
![]() |

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ కి ఉన్న క్రేజ్ వేరు.ఆయన ప్రతి సినిమా రిలీజ్ ని ఫ్యాన్స్ పండుగల చేసుకుంటారు. ఆయన నటించిన ఎన్నో సినిమాలు టాలీవుడ్ లో రికార్డులు సృష్టించాయి. సృష్టిస్తునే ఉన్నాయి కూడా. రెండున్నర దశాబ్దాల నుంచి ఆ విషయంలో ఎలాంటి మార్పు లేదు. లేటెస్ట్ గా మహేష్ మూవీకి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
మొన్న సంక్రాంతికి మహేష్ గుంటూరు కారం తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వన్ మాన్ షో తో మూవీ మొత్తాన్ని నడిపించి తన నటనకి ఉన్న శక్తిని చాటి చెప్పాడు. ఆ మూవీ కలెక్షన్ల పరంగా ఎన్నో రికార్డులు కూడా క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆ మూవీ ఏప్రిల్ 7 వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఉగాది సందర్భంగా ప్రముఖ టెలివిజన్ ఛానల్ జెమినీలో టెలికాస్ట్ కానుంది దీంతో బిగ్గెస్ట్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా గుంటూరు కారం నిలిచిపోనుంది. థియేటర్స్ లలో, ఓటిటి లో అదరగొట్టిన గుంటూరు కారం మరి బుల్లి తెర మీద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించగా హారికా & హాసిని క్రియేషన్స్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మాతగా వ్యవహరించాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. థమన్ సంగీతం లో వచ్చిన అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. కుర్చీ మడత పెట్టి సాంగ్ వైబ్రేషన్ ఇంకా తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతూనే ఉంది. మహేష్ తన నెక్స్ట్ మూవీని రాజమౌళి దర్శకత్వంలో చెయ్యబోతున్నాడు. త్వరలోనే ఆ మూవీ సెట్స్ మీదకి వెళ్లనుంది.
![]() |
![]() |