![]() |
![]() |

లాస్ట్ ఇయర్ అమెరికన్ సినీ ప్రియులని ఒక ఊపిన స్పై యాక్షన్ థ్రిలర్ సిటాడెల్. అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదలైన ఈ సిరీస్ అనుక్షణం ఉత్కంఠతని రేపుతు మంచి విజయాన్నే అందుకుంది. సమంత కథానాయికిగా ఈ సిరీస్ బాలీవుడ్ లో తెరకెక్కింది.లేటెస్ట్ గా ఈ సినిమాకి టైటిల్ ఫిక్స్ అయ్యింది.
సిటాడెల్ కి సిటాడెల్ హనీ అండ్ బన్నీ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. ముంబయి వేదికగా ప్రైమ్ వీడియో నిర్వహించిన కార్యక్రమంలో టైటిల్ ని లాంచ్ చేసారు. కాకపోతే స్ట్రీమింగ్ ఎప్పుడు అనేది మాత్రం వెల్లడి చెయ్యలేదు. ఈ సిరీస్ కోసం సమంత మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ కూడా తీసుకుంది. ఎన్నో కఠినతరమైన ఫైట్స్ ని కూడా ఎలాంటి డూప్ లేకుండా చేసింది. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. 1990 కాలం నాటి నేపథ్యంలో ఈ సిరీస్ తెరకెక్కింది.

రాజ్ అండ్ డికే దర్శకులుగా వ్యవహరించగా ఒరిజినల్ సిటాడెల్ ని నిర్మించిన రుస్సో బ్రదర్స్ ఈ సిరీస్ కి కూడా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.. ఇంతకు ముందు సమంత ఫ్యామిలీ మాన్ 2 అనే వెబ్ సిరీస్ లో నటించడంతో సిటాడెల్ హనీ అండ్ బన్నీ పై కూడా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొని ఉంది. సిటాడెల్ ఒరిజినల్ లో రిచర్డ్ మేడిన్ ప్రియాంక చోప్రాలు నటించారు.
![]() |
![]() |