![]() |
![]() |
‘గాజు పగిలేకొద్దీ పదునెక్కుంది..’, ‘గుర్తు పెట్టుకో..గ్లాస్ అంటై సైజ్ కాదు, సైన్యం’.. కనిపించని సైన్యం’ వంటి మోస్ట్ పవర్ఫుల్ డైలాగ్స్, మరోసారి తన స్టామినా ఏమిటో చూపించేందుకు ‘ఉస్తాద్ భగత్‌సింగ్’గా పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ రెడీ అవుతున్నాడు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా తన సత్తా చూపించేందుకు యూనిఫామ్‌లో ఎంటర్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ‘భగత్’స్ బ్లేజ్ పేరుతో రిలీజ్ అయిన టీజర్లో పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ తన విశ్వరూపాన్ని చూపించాడు.
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. ‘గబ్బర్‌సింగ్’ తర్వాత పవర్‌స్టార్, హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా మోస్ట్ పవర్ఫుల్ ఎలిమెంట్స్‌తో రూపొందినట్టు కనిపిస్తోంది. ప్రతి షాట్లో పవర్‌స్టార్ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్తో థియేటర్లు దద్దరిల్లిపోతాయా అన్నంతగా ఈ టీజర్ ఉంది. హరీష్ శంకర్ టేకింగ్కి దేవిశ్రీప్రసాద్ పవర్ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా తోడై టీజర్ అదరహో అనే రేంజ్లో ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ శ్రీలీల మరో ప్రత్యేక ఆకర్షణ కాబోతోంది.
‘ఉస్తాద్ భగత్‌సింగ్’తో డ్యామ్ ష్యూర్‌గా పవర్‌స్టార్ మరో పవర్ఫుల్ బ్లాక్‌బస్టర్ సాధించడం ఖాయమని టీజర్ చూస్తేనే అర్థమవుతోంది. ఇక ఈ టీజర్ ఏ రేంజ్లో ఉందో చూసిన పవన్‌కళ్యాణ్ ఫ్యాన్స్ ఆనందాన్ని అవధుల్లేవు.
![]() |
![]() |