![]() |
![]() |

సిల్వర్ స్క్రీన్ మీద డైరెక్టర్ సూర్య కిరణ్ కి మంచి పేరుంది. ఐతే రీసెంట్ గా ఆయన అనారోగ్యంతో మరణించిన విషయం గురించి తెలిసిందే. చాలామంది సూర్యకిరణ్ గురించి ఆల్రెడీ చాలామంది చాలా పోస్టులు కూడా పెట్టారు. కానీ సూర్య కిరణ్ చెల్లెలు సుజిత ధనుష్ కొంచెం లేట్ గా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పోస్ట్ పెట్టింది. "అన్నయ్య రెస్ట్ ఇన్ పీస్.. నువ్వు నాకు కేవలం అన్నవే కాదు నాన్నవు, హీరోవి కూడా. నీ మాటలని , నీ టాలెంట్‌ని ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటాను. మరో జన్మ అంటూ ఉంటే నువ్వు కన్న కలలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను." అని పోస్ట్ చేసింది. సూర్యకిరణ్‌తో పాటు దిగిన ఒక ఓల్డ్ పిక్ ని కూడా షేర్ చేసింది.

ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ఐన సూర్యకిరణ్ కొంత కాలంగా పచ్చకామెర్లతో బాధపడుతూ ట్రీట్మెంట్ తీసుకుంటూ మరణించిన విషయం తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్ట్ గా మాష్టర్ సురేష్ పేరుతో కెరీర్ స్టార్ట్ చేసిన సూర్యకిరణ్ అంచెలంచెలుగా ఎదిగాడు. స్టార్ హీరోలతో దాదాపు 200 చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘సత్యం’ మూవీతో డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ధన, బ్రహ్మస్త్రం, రాజూ భాయ్ వంటి ఎన్నో మూవీస్ ని డైరెక్ట్ చేశారు. తమిళ్‌లోకూడా ఎన్నో చిత్రాలను తీశారు. ఇక నటి కళ్యాణిని వివాహం చేసుకున్న సూర్యకిరణ్.. వ్యక్తిగత కారణాలతో ఆమె నుంచి విడాకులు తీసుకున్నారు. డైరెక్టర్ గా వరుస ఫెయిల్యూర్స్ రావడం, ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కళ్యాణి దూరం కావడంతో చాలా ఏళ్లు ఇండస్ట్రీకి దూరమైపోయారు సూర్య కిరణ్. విడాకులు తీసుకున్న తర్వాత ఏడేళ్ల పాటు ఎవరికీ కనిపించకుండా అజ్ఞాతంలో ఉండిపోయారు సూర్య కిరణ్. చివరిగా 2020లో బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు.
![]() |
![]() |