![]() |
![]() |

సినిమా రంగంలో కామెడీ నటుడుగా రాణించాలంటే అంత తేలికైన విషయం కాదు.ఒకటి రెండు సినిమాలు చెయ్యగానే ఆయన చేసే కామెడీ మీద ప్రేక్షకులకి బోర్ కొడుతుంది. కానీ తమ కంటూ ఒక బాడీ లాంగ్వేజ్ ని, డైలాగ్ మాడ్యులేషన్ ని సృష్టించుకొని సుదీర్ఘ కాలం నుంచి కామెడి నటులుగా రాణిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి ఒక కామెడీ నటుడే సప్తగిరి. ఇప్పుడు టాక్ అఫ్ ది టౌన్ గా నిలిచాడు
సప్తగిరి రీసెంట్ గా తెలుగుదేశం,జనసేన పార్టీ మీటింగ్ లో ప్రత్యక్షమయ్యాడు. ఆ రెండు పార్టీల జెండాలని ధరించి కార్యకర్తలకి సుదీర్ఘ మైన స్పీచ్ ని కూడా ఇచ్చాడు.సదరు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. చంద్రబాబు నాయుడు అంటే ఇష్టమని ఆయన చేసిన అభివృద్ధి ని చూస్తు పెరిగానని గతంలో ఒకసారి చెప్పాడు. అలాగే టీడీపీలో చేరతానని కూడా చెప్పాడు. దీంతో చెప్పిన మాటని నిలబెట్టుకున్నట్లు అయ్యింది. ఈ క్రమంలోనే ఆయన చేరిక ప్రాధాన్యతని సంతరించుకుంది. ఎంఎల్ఏ గా గాని ఎంపి గా గాని ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి పోటీ చెయ్యాలని ఉందని గతంలోనే చెప్పాడు.
బొమ్మరిల్లు, పరుగు, దేశముదురు, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, కందిరీగ, రాజు గారి గది, దృశ్యం, సినిమా చూపిస్తా మావ, శంకరా భరణం, వీర సింహ రెడ్డి, సలార్ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. సుమారు 80 చిత్రాలకి పైగానే చేసాడు. హీరోగా కూడా కొన్ని సినిమాల్లో కనిపించాడు.చిత్తూరు జిల్లాలోని ఐరాల సప్తగిరి సొంత ప్రాంతం.
![]() |
![]() |