![]() |
![]() |

ఇంక లాభం లేదు. దేవర టీం దూసుకుపోయే సమయం వచ్చింది. ఆఫ్ కోర్స్ ఇప్పుడు దేవర టీం కి కూడా నయా జోష్ వచ్చింది. ఒక హీరో నేను షూటింగ్ కి వస్తున్నానని కబురు పెట్టాడు.అసలే ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సిన మూవీ అక్టోబర్ కి వాయిదా పడింది. ఇక లేటు చెయ్యకుండా షూట్ కి వెళ్లడమే. ఇంతకీ ఆ హీరో ఎవరు? ఏమని కబురు పంపించాడో చూద్దాం.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రెస్టేజియస్ట్ మూవీ దేవర. రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. పార్ట్ 1 లో ప్రముఖ బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రని పోషిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఒక సినిమా షూటింగ్ లో గాయాలు అవ్వడం వలన చిన్న సర్జరీ జరిగింది. ఆ ఎఫెక్ట్ తో దేవర షూటింగ్ పోస్ట్ పోన్ అయ్యింది. ఇప్పడు షూటింగ్ ని నేను రెడీ అంటూ సైఫ్ దేవర టీం కి కబురు పంపాడు. దీంతో మేకర్స్ షూటింగ్ కి సిద్ధం అవుతున్నారు. ఆల్రెడీ కొరటాల శివ ఈ నెల మూడవ వారంలో షూటింగ్ కి ప్లాన్ చేసాడని అంటున్నారు.ఇక ఈ షెడ్యూల్ కంటిన్యూగా కొనసాగనుంది. గతంలో వేసిన కొన్ని భారీ సెట్స్ ఇప్పటికీ అలాగే ఉన్నాయి. వాటిల్లోనే షూటింగ్ జరగనుంది.

సైఫ్ అలీ ఖాన్ అందుబాటులోకి వచ్చిన దృష్ట్యా కొరటాల శివ ఎట్టి పరిస్థితుల్లోను షూటింగ్ ని లేటు చెయ్యడానికి వీల్లేదు. ఎందుకంటే దేవర టాప్ క్యాస్ట్ మొత్తం రాబోయే రోజుల్లో ఫుల్ బిజీగా ఉండబోతుంది. ఎన్టీఆర్ వార్ 2 తోను జాన్వీ కపూర్ చరణ్ మూవీతోను సైఫ్ అలీ ఖాన్ అదర్ బాలీవుడ్ మూవీతోను బిజీగా ఉండబోతున్నారు. పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతున్న దేవర మీద ఎన్టీఆర్ ఫ్యాన్స్ లోను ప్రేక్షకుల్లోను భారీ అంచనాలే ఉన్నాయి. ఆల్రెడీ థియేటర్స్ లో దేవర టీజర్ సంచలనం సృష్టిస్తూ ఉంది.ఇక మూవీ రిలీజ్ అయ్యాక ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
![]() |
![]() |