![]() |
![]() |

తమిళ చిత్రపరిశ్రమలో ఉన్న అగ్ర నటుల్లో విజయ్ కూడా ఒకడు. అభిమానులందరు ఇళయ తలపతి అని ముద్దుగా పిలుచుకుంటారు. ఆయన సినిమా రిలీజ్ అయిందంటే చాలు తమిళనాడు మొత్తం పండగ వాతావరణం నెలకొని ఉంటుంది. ఇటీవలే లియో తో తన సత్తా చాటాడు. విడుదలైన అన్ని చోట్ల ఆ మూవీ రికార్డు కలెక్షన్స్ ని సృష్టించింది. ఇప్పుడు ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం అనే కొత్త మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. తాజాగా విజయ్ కి సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ గా మారింది.
తమిళ చిత్ర సీమలో ఎప్పటినుంచో నడిగర్ సంఘానికి ప్రత్యేకంగా ఒక బిల్డింగ్ ఉండాలనే కృషి జరుగుతుంది.అందుకు సంబంధించిన భవనం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఈ క్రమంలో నడిగర్ సంఘానికి విజయ్ కోటి రూపాయిలని ప్రకటించాడు. సంఘ అధ్యక్షుడు హీరో విశాల్ ని కలిసి కోటి రూపాయిల చెక్ ని ఇచ్చాడు. ఇప్పుడు ఈ విషయం అందరకి తెలియడంతో విజయ్ మీద ప్రశంసల వర్షం కురుస్తుంది. విశాల్ కూడా తన ట్విటర్ వేదికగా విజయ్ కి ధన్యవాదాలు తెలిపాడు. తన అభిమాన హీరో విజయ్ నే అని కూడా చెప్పాడు. ఇక నడిగర్ సంఘం అనేది తమిళ నటీనటుల సంక్షేమం కోసం ఏర్పడిన సంస్థ.
బాలనటుగా సినీ రంగ ప్రవేశం చేసిన విజయ్ ఇప్పటివరకు 67 చిత్రాలకి పైనే చేసాడు.అప్ కమింగ్ మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం 68 వ చిత్రం. ఇక కొన్ని రోజుల క్రితం తమిళగ వెట్రి కజగం అనే పేరుతో ఒక పొలిటికల్ పార్టీని కూడా స్థాపించాడు.తమిళ ప్రజలకి సేవ చెయ్యాలనే లక్ష్యంతోనే పార్టీని పెట్టినట్టుగా కూడా ప్రకటించాడు. దీంతో నడిగర్ సంఘానికి కోటి రూపాయలని ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
![]() |
![]() |