![]() |
![]() |

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను 'హనుమాన్' మూవీ టీం కలిసింది. తాజాగా తెలంగాణ పర్యటనకు అమిత్ షా రాగా.. హీరో తేజ సజ్జ, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వెళ్లి కలిశారు. వారితో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ.. హనుమంతుడి షీల్డ్ ని అమిత్ షాకు బహుకరించారు.
తేజ సజ్జ, ప్రశాంత్ వర్మను కలిసిన విషయాన్ని అమిత్ షా సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం విశేషం. "ఇటీవల హనుమాన్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన ప్రతిభావంతులైన నటుడు తేజ సజ్జ, దర్శకుడు ప్రశాంత్ వర్మను కలిశాను. భారతదేశం యొక్క ఆధ్యాత్మిక సంప్రదాయాలను మరియు వాటి నుండి ఉద్భవించిన సూపర్ హీరోలను ప్రదర్శించడంలో బృందం ప్రశంసనీయమైన పని చేసింది. భవిష్యత్ లో మరిన్ని మంచి చిత్రాలు చేయాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను." అని రాసుకొచ్చిన అమిత్ షా.. ఈ సందర్భంగా వారితో దిగిన ఫొటోలను కూడా షేర్ చేశారు. ఇక అమిత్ షాను కలవడం గౌరవంగా భావిస్తున్నామని తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని పంచుకున్నారు.

కాగా, అమిత్ షా తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు తెలుగు హీరోలను కలుస్తుండటం ఆసక్తికరంగా మారింది. గతంలో హైదరాబాద్ కి వచ్చినప్పుడు 'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ ని ప్రత్యేకంగా పిలిపించుకొని మరీ కలిశారు. ఎన్టీఆర్ తో చాలాసేపు ముచ్చటించడమే కాకుండా.. కలిసి భోజనం కూడా చేశారు. ఆ సమయంలో అది హాట్ టాపిక్ అయింది. ఇక ఇప్పుడు 'హనుమాన్'తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హీరోని, డైరెక్టర్ ని కలవడం విశేషం.
![]() |
![]() |