![]() |
![]() |

చిన్నచిన్న ఎలిమెంట్స్ ని తీసుకొని ప్రేక్షకులని రంజింపజేసేలా ' మై విలేజ్ షో ' యూట్యూబ్ ఛానెల్ వాళ్ళు రెగ్యులర్ గా వ్లాగ్స్ చేస్తుంటారు. ఈ యూట్యూబ్ ఛానెల్ లోని వ్లాగ్స్ అన్నీ దాదాపు లక్ష పైచిలుకు వ్యూస్ వస్తుంటాయి.
ఊరినుండి సిటీకి జాబ్ కోసం వచ్చి సెటిల్ అయ్యేవాళ్ళు చాలామందే ఉన్నారు. కానీ వాళ్ళంతా ఊరికి ఊరిమనుషులకి, ఊరిలో జరిగే సంఘటనలకి కనెక్ట్ అయ్యే ఉంటారు. అయితే ప్రతీ ఊళ్ళో జరిగే కొన్ని సంఘనలని, వాస్తవాలని మనకి పరిచయం చేయడానికి ' మై విలేజ్ షో ' నటీనటులంతా ఓ లఘుచిత్రంతో వస్తున్నారు. అనిల్ జీలా, గంగవ్వ, చందు, అంజి మామ ఇంకా కొందరు కలిసి ' మేళా ' అనే లఘుచిత్రంలో నటించారు. పక్క పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ కథ ఎలా ఉండబోతుందా వివరిస్తూ తాజాగా ఓ ట్రైలర్ వదిలారు మేకర్స్. మరి ఇందులో ఊరిలో జరిగే సమస్యలు, వాటిని పరిష్కరించడానికి పంచాయితి తీర్పు, ప్రేమ గొడవలు, అన్నదమ్ముల అనుబంధాలు అన్నీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ట్రైలర్ చూస్తుంటే ఏదో గట్టి కాన్సెప్ట్ ముందుముందు జానాల కోసం అనిల్ జీలా రెడీ చేస్తున్నట్లుగా చేస్తుంది.
అయితే ఇప్పటికే ఈ ట్రైలర్ ని చూసిన కొంతమంది నెటిజన్లు " గట్టిగా ప్లాన్ చేసినట్టు ఉన్నారుగా ".. అనిల్ జీల, చందు, అంజిమామలు చాలా నేచురల్ గా చేసారంటు కామెంట్లని చేశారు. మరి ఈ 'మేళా' ట్రైలర్ ని మీలో ఎంతమంది చూశారు. చూడకపోతే ఓ లుక్కేయండి. ట్రైలర్ చూసినవారు ఎలా ఉందో కామెంట్ చేయండి.
![]() |
![]() |