![]() |
![]() |

కమెడియన్ వైవా హర్ష హీరోగా నటించిన మూవీ 'సుందరం మాస్టర్'. గోల్ డెన్ మీడియాతో కలిసి RT టీమ్ వర్క్స్ బ్యానర్ పై మాస్ మహారాజా రవితేజ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 23న విడుదలై పరవాలేదు అనిపించుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతోంది.
'సుందరం మాస్టర్' రెండు ఓటీటీ వేదికల్లో విడుదల కానుంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఈటీవీ విన్ తో పాటు ఆహా దక్కించుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ అయినట్లు తెలుస్తోంది. మార్చి 22 నుంచి ఓటీటీలో అందుబాటులోకి రానుందని సమాచారం. అంటే థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకు ఓటీటీలోకి అడుగుపెడుతోంది అన్నమాట.
దివ్య శ్రీపాద, హర్షవర్ధన్, బాలకృష్ణ నీలకంఠపురం, భద్రం, చైతన్య తదితరులు నటించిన ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు. సినిమాటోగ్రాఫర్ గా దీపక్ యరగేరా, ఎడిటర్ గా కార్తీక్ వ్యవహరించారు.
![]() |
![]() |