![]() |
![]() |
పెళ్ళిళ్ల సీజన్ మొదలైందంటే సినిమా ఇండస్ట్రీలో కూడా కొన్ని జంటలు పెళ్లికి రెడీ అవుతుంటాయి. ఇప్పుడు ఓ టాలీవుడ్ యంగ్ హీరో పెళ్లికి రెడీ అయ్యాడు. గత సంవత్సరం తన సొంతింటి కలను నెరవేర్చుకొని స్వగ్రామంలో ఓ ఇల్లు నిర్మించుకున్న ఆ యంగ్ హీరో ఇప్పుడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అతనెవరో కాదు, టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. షార్ట్ ఫిలింస్ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న కిరణ్ ‘రాజావారు రాణీవారు’ చిత్రంతో టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా అనూహ్యంగా చాలా పెద్ద హిట్ అయింది. అ తర్వాత కిరణ్ చేసిన ‘ఎస్.ఆర్. కళ్యాణ మంటపం’ చిత్రం కూడా విజయం సాధించింది. దీంతో కిరణ్‌కు హీరోగా మంచి అవకాశాలే వస్తున్నాయి.
‘రాజావారు.. రాణీవారు’ చిత్రంలో హీరోయిన్గా నటించిన రహస్య గోరఖ్‌నే కిరణ్ పెళ్లిచేసుకోబోతున్నాడు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించడం, పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగిపోయింది. గత కొన్నేళ్ళుగా వీరిద్దరూ రహస్యంగా ప్రేమించుకుంటూ రిలేషన్ షిప్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. వీరి రిలేషన్ గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ వార్తలు వస్తూనే ఉంటాయి. కిరణ్ వాటిని స్పోర్టివ్‌గా తీసుకుంటూ రహస్యతో రహస్యంగానే ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడు. తను ఊరిలో నిర్మించిన ఇంటికి సంబంధించిన గృహప్రవేశ వేడుకలో కూడా రహస్య సందడి చేసింది. ఇప్పుడు మూడు ముళ్ళ బంధంతో కిరణ్, రహస్య ఒక్కటి కాబోతున్నారు. బుధవారం వీరి నిశ్చితార్థ వేడుక జరగనుంది. త్వరలోనే వివాహ తేదీని ప్రకటిస్తారట.
![]() |
![]() |