![]() |
![]() |

ఒక్క అవకాశం..ఒక్క అవకాశం..తెలుగు సినిమా పరిశ్రమలో తరచూ వినపడే మాట. ఆ ఒక్క అవకాశం వస్తే చాలు ఇంక తెలుగు సినిమాని ఏలవచ్చు. ఇలా ఒక్క అవకాశంతో తమ సత్తా చాటి అగ్ర హీరోయిన్లు గా ఎదిగిన నటీమణులు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో ఒకరు శ్రీలీల. న్యూ పెళ్లి సందడి తో తన సినీ కెరీర్ ని ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు టాక్ ఆఫ్ ది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గా మారింది.
శ్రీలీల కి ఇటీవలే ఒక బడా హీరో మూవీని రిజెక్ట్ చేసిందనే వార్తలు వస్తున్నాయి. ఆ మూవీలో ఉన్న ఒక ఐటెం సాంగ్ ని శ్రీ లీల చేత చేయించాలని మేకర్స్ సంప్రదించారని కానీ ఆమె నో చెప్పినట్టు సమాచారం. నిర్మాతలు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్దపడినా కూడా ఆమె నో చెప్పిందని అంటున్నారు. గతంలో అల్లు అర్జున్ పుష్ప 2 లోని ఐటెం సాంగ్ కి కూడా ఆమె ఒప్పుకోలేదనే వార్తలు వచ్చాయి .ప్రస్తుతం ఐటెం సాంగ్స్ చేయడానికి శ్రీలీల ఇష్టపడటం లేదని అందుకే ఆమె రిజెక్ట్ చేస్తునట్టు చెప్తున్నారు. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం ఎమ్ బి బి ఎస్ కి ప్రిపేర్ అవ్వడం కోసం ఆమె ఎలాంటి కొత్త చిత్రాల షూటింగ్ లో పాల్గొనడం లేదు
శ్రీ లీల నుంచి గత ఏడాది స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ లు వచ్చాయి.వాటిల్లో భగవంత్ కేసరి హిట్ అవ్వగా మిగిలిన మూడు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. కాకపోతే ఈ ఏడాది మాత్రం మహేష్ తో కలిసి చేసిన గుంటూరు కారం ఒక మోస్తరు విజయాన్ని అందుకుంది. పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే తన చేతిలో ఉంది.
![]() |
![]() |