![]() |
![]() |
.webp)
విశ్వక్ సేన్ నటించిన "గామి" మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. దీని మీద మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. కొంతమందికి ఈ మూవీ నచ్చిందంటే, కొందరికి మాత్రం నచ్చలేదు అంటున్నారు. ఐతే ఈ మూవీని చూసిన గీతూ, శ్రీసత్య చూసి వాళ్ళ ఒపీనియన్స్ ని షేర్ చేసుకున్నారు."గామి మూవీ సీరియల్ సిరీస్ లా ఉంది..మూడు గంటల సినిమాను అరగంటలో తీసేసినట్టుగా ఉంది..కాన్సెప్ట్ చాలా బాగుంది కానీ మూవీ తీసిన విధానం అస్సలు నచ్చలేదు. ఫస్ట్ డెబ్యూ మూవీనే ఇంత రిస్కీ సబ్జెక్టు ని ఇంత హడావిడిగా చేయాల్సిన అవసరంలేదు. బాహుబలి రేంజ్ కాకపోయినా దానిలో సగం రేంజ్ లో ఐనా ఉంటుందేమో అనుకున్నా. కాశ్మీర్ లో రెండు డిగ్రీల సెంటీగ్రేడ్ చలిలో విశ్వక్ సేన్ వాళ్ళు ఎంతో కష్టపడి ఈ సినిమా చేసారు.
80 పెర్సెంట్ మొత్తం మూవీని ఒరిజినల్ గానే చేశారు. చాలా కష్టపడ్డారు కానీ సినిమా నచ్చలేదు. రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ ని ఇష్టపడేవాళ్ళకు ఈ మూవీ కచ్చితంగా ల్యాగ్ అనిపిస్తుంది. డిఫరెంట్ సబ్జెక్టుని, డిఫెరెంట్ కాన్సెప్ట్ ని ఇష్టపడే వాళ్లకు ఈ మూవీ నచ్చుద్ది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ మూవీ అర్ధమయ్యింది కానీ ఈ మూవీ మాత్రం నాకు అర్ధం కాలేదు. మంచు ఉన్నప్పుడు స్నో టైగర్ ఉండాలి..లేదా వైట్ టైగర్ కానీ పోలార్ బేర్ కానీ ఉండాలి కానీ అడవుల్లో తిరిగే పులి ఉంటే బాగోదు...కొంత ఎక్స్పీరియన్స్ వచ్చాక ఈ మూవీని తీసుంటే బాగుండేదేమో అనిపిస్తోంది. నా రేటింగ్ ఈ మూవీకి 10 / 2 . 5 ఇస్తాను. డైరెక్టర్ వచ్చి అడిగినా ఇదే చెప్తాను. విశ్వక్ సేన్ ఫస్ట్ సబ్జెక్టు ఇది..డబ్బులు తీసుకోకుండా నటించిన సినిమా ఇది.. అన్ని మూవీస్ కంటే ఇదే ముందు రిలీజ్ కావాల్సి ఉంది. ఇది నా అభిప్రాయం మాత్రం..వాళ్ళు పెట్టిన ఎఫోర్ట్స్ కి ఒకసారి మూవీ చూసి రండి" అని చెప్పారు గీతూ, శ్రీ సత్య.
![]() |
![]() |