![]() |
![]() |

మూవీ : వళరి
నటీనటులు: రితిక సింగ్, శ్రీరామ్, ఉత్తేజ్, సుబ్బరాజు, ప్రిన్సెస్ సహస్ర, పర్ణిత రుద్రరాజు
ఎడిటింగ్: తమ్మి రాజు
మ్యూజిక్: టి.ఎస్ విష్ణు, హరి గౌర
సినిమాటోగ్రఫీ: సుజాత సిద్దార్థ్
నిర్మాత: సత్య సాయి బాబా
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మృతిక సంతోషిణి
ఓటీటీ : ఈటీవి విన్
కథ:
ఓ ఇంట్లో ఉన్న అమ్మాయి తన అమ్మనాన్నలని చంపి జైలుకెళ్తుంది. అయితే తను వయసులో చిన్నదవడం వల్ల మానసిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తారు. ఇక కొన్ని సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయి పెద్దదవుతుంది. తన బాల్యమే తనకి పదే పదే కలలో వస్తుంటుంది. ఇక ప్రస్తుతంలో.. నవీన్(శ్రీరామ్) అనే నేవి కెప్టెన్ ని పెళ్ళి చేసుకుంటుంది దివ్య( రితిక సింగ్).. వారిద్దరికి ఓ బాబు ఉంటాడు. అతని పేరు మధు. అయితే దివ్యకి ప్రతీరోజు అదే కల మళ్ళీ మళ్లీ వస్తుంటుంది. అయితే కొన్ని రోజులు గడవకముందే నవీన్ కి కృష్ణపట్నం దగ్గరకి ట్రాన్సఫర్ అవుతుంది. అక్కడ ఓ క్వార్టర్స్ ఇవ్వగా దివ్య హ్యాపీగా ఉన్నా.. నవీన్ ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాడు. ఇక ఆ క్వార్టర్స్ నుండి వాళ్ళ కొడుకు మధు స్కూల్ కి వెళ్లే దారిలో ఓ పాతబడిన బంగ్లా కన్పిస్తుంటుంది. అది దివ్యకి చాలా నచ్చుతుంది. ఇక నవీన్ అ విషయం తెలుసుకొని అ బంగ్లాలో రెంటు ఉండటానికి వస్తాడు. అ తర్వాత బంగ్లాలో ఏం జరిగింది? దివ్యకి ఆ బంగ్లాకి మధ్య గల గతమేంటనేది మిగతా కథ.
విశ్లేషణ:
ఓ చిన్నపాప తన తల్లిదండ్రులనే ఎందుకు చంపిందనే క్యూరియాసిటితో కథ ఆసక్తిగా మొదలైంది. ఇక అ తర్వాత దివ్య పాత్ర చుట్టూ ఏదో జరుగుతుందనే ఆసక్తిని రేకెత్తించిన తీరు బాగుంది. కానీ ఒకే గతం మళ్లీ మళ్లీ చూడాలంటే కాస్త బోరింగ్ గా ఉంటుంది. అదేవిధంగా ఫస్టాఫ్ లో మొదటి పదిహేను నిమిషాల వరకు ఆసక్తిని కలిగించిన డైరెక్టర్ చివరిదాకా కొనసాగించలేకపోయారు.
వళరి నిలయంలో ఏం జరిగిందనే ఫ్లాష్ బ్యాక్ లో సరైన స్పష్టత ఇవ్వలేదు. హారర్ ఎలిమెంట్స్ ఎక్కువగా లేకపోవడం.. రిపెటెడ్ సీన్స్ రావడం.. కథ గ్రిస్పింగ్ గా లేకపోవడం ఈ సినిమాకి పెద్ద మైనస్. క్లైమాక్స్ వరకు సాగే నిరీక్షణలో వచ్చే ట్విస్ట్ బాగుంటుంది. అయితే ఆ ట్విస్ట్ కోసం జనాలని రెండు గంటలు ఓపికతో ఉండమని చెప్పడం బాగోలేదు. ఏదీ ఓ క్లారిటీ ఉండదు. ఇలాంటి సినిమాలకి బిజిఎమ్ బాగుండాలి. కానీ అది సరిగ్గా కుదరలేదు. హారర్ సీన్స్ ఉన్నవే తక్కువ అక్కడ కూడా సరైన బిజిఎమ్ లేకపోవడం కూడా మైనస్ . కొన్నిచోట్ల వరలక్ష్మీ శరత్ కుమార్ చేసిన వెబ్ సిరీస్ మాన్షన్ 24 రెఫరెన్స్ తీసుకున్నారేమోనని అనిపిస్తుంది.
అయితే కథని సరైన విధంగా ముగించలేదు. చివరలో వచ్చే పేపర్ ఆర్టికల్స్ లోని చైల్డ్ అబ్యూజింగ్ కేసులకు ఈ సినిమాకు ఏం సంబంధమో అర్థం కాలేదు. అయితే ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లో వళరి చేసే కర్రసాము బాగుంటుంది. ఇక అ తర్వాత తన క్యారెక్టర్ ని ముగించిన తీరు బాలేదు. కొన్నిచోట్ల లాజిక్ ని మిస్ అయ్యారు.
దివ్య గతాన్ని నవీన్ ఎలా తెలుసున్నాడనేది ఓ మిస్టరీగా మిగిలిపోతుంది. ఒకనొక దశలో దివ్యని నవీన్ ఇలా ట్రాప్ చేశాడా అనిపించేలా శ్రీరామ్ నటన ఉంటుంది. ఇక నెమ్మదిగా సాగే సీన్లు కాస్త చిరాకు తెప్పిస్తాయి. టి.ఎస్ విష్ణు బిజిఎమ్ సరిపోలేదు. సుజాత సిద్దార్థ్ సినిమాటోగ్రఫీ బాగుంది. తమ్ని రాజు ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
దివ్య, దర్శిని పాత్రలలో రితిక సింగ్ ఒదిగిపోయింది. నవీన్ పాత్రలో శ్రీరామ్ ఆకట్టుకున్నాడు. ఉత్తేజ్, సుబ్బరాజు తమ పాత్రలకి న్యాయం చేశారు.
ఫైనల్ గా...
హరర్ సినిమా లవర్స్ కి నిరాశే. కానీ రెగ్యులర్ థ్రిల్లర్ సినిమాలకి కాస్త భిన్నంగా ఉన్న ఈ సినిమాని ఓసారి చూసేయొచ్చు.
రేటింగ్: 2.5 / 5
✍️. దాసరి మల్లేశ్
![]() |
![]() |