![]() |
![]() |

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కార్తికేయ మూవీతో ఆడియన్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఉంగరాల జుట్టుతో క్యూట్ లుక్స్ తో తెలుగు ఆడియన్స్ ని తన చూపులతో గుచ్చి గుచ్చి చంపేస్తుంది. తన అందం, నటన, క్యూట్ ఎక్స్ ప్రెషన్స్‌తో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది ఈ కేరళ కుట్టి. త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన "అ..ఆ" మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైనా అనుపమ పరమేశ్వరన్.. ఆ తరువాత యూత్‌ఫుల్ మూవీస్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. రామ్, నాగ చైతన్య, నిఖిల్, నాని వంటి యంగ్ స్టార్స్‌తో ఈ అమ్మడు నటించింది. రవితేజతో ఈగల్, జోన్నలగడ్డ సిద్దుతో టిల్లు స్కైర్ వంటి మూవీస్ లో ఆమె నటించింది. అలాంటి అనుపమ రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో వీడియో పెట్టింది.
అందులో వాళ్ళ హజ్బెండ్ ని గ్రోసరీస్ తెమ్మని పంపడానికి సరికొత్త ఐడియా వేసింది. అదేంటంటే చిన్నపిల్లలకు స్కూల్ లో పేస్టింగ్ యాక్టివిటీ ఇస్తే వాళ్ళు ఆ సబ్జెక్టు కి తగ్గట్టు రకరాల పిక్స్ కానీ, కాయిన్స్ ని కానీ ఒక వైట్ చార్ట్ మీద అంటించి స్కూల్ కి తీసుకెళ్తూ ఉంటారు. ఇప్పుడు అనుపమ కూడా అదే చేసింది. ఇంట్లో తనకు ఎం గ్రోసరీస్ కావాలో వాటిని చార్ట్ లో అంటించి దాన్ని ఇచ్చి మార్ట్ కి పంపించింది. "ఇదిగో చూసారా మా హజ్బెండ్ ని గ్రోసరీస్ తెమ్మని ఎలా పంపించానో..మరి మీరు ?" అని చెప్తూ ఒక నవ్వు ఇమేజిని పోస్ట్ చేసుకుంది. ప్రేమమ్ మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనుపమ 18 పేజెస్, కార్తీకేయ, బటర్ ఫ్లై మూవీస్ లో నటించింది. పదేళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది అనుపమ..కానీ ఎక్కడా బ్రేక్ రాకుండా..అలా కూల్ గా కెరీర్ ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళింది ఈ మలయాళ బ్యూటీ.
![]() |
![]() |