![]() |
![]() |

హీరో శర్వానంద్, రక్షిత దంపతులు ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న శర్వానంద్.. తన కూతురుకు 'లీలా దేవి' అనే పేరు పెట్టినట్లు తెలిపాడు.
శర్వా, రక్షిత వివాహం గతేడాది జూన్ లో జరిగింది. ఇటీవలే రక్షిత ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఈ విషయాన్ని శర్వానంద్ తన పుట్టినరోజు(మార్చి 6) సందర్భంగా తాజాగా రివీల్ చేశారు. అంతేకాదు పాప ఫేస్ ని రివీల్ చేయకుండా కొన్ని ఫొటోలను కూడా షేర్ చేశారు. ఆ ఫొటోలు ఎంతో క్యూట్ గా ఉన్నాయి. శర్వా చేతి వేలిని పాప పట్టుకోవడం, అలాగే పాప కాళ్ళను పట్టుకొని రక్షిత ముద్దాడటం బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలాగే పాపకు 'లీలా దేవి' లాంటి అర్థవంతమైన, అందమైన పేరు పెట్టడంపై ప్రశంసలు కురుస్తున్నాయి.

సినిమాల విషయానికొస్తే శర్వానంద్ ప్రస్తుతం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో 'మనమే' అనే సినిమా చేస్తున్నాడు. అలాగే యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో అభిలాష్ డైరెక్షన్ లో ఒక సినిమా, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు.
![]() |
![]() |