![]() |
![]() |

'వార్-2' సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందనున్న ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ పంచుకోనున్నాడు ఎన్టీఆర్. అయితే అసలు ఎన్టీఆర్ 'వార్-2' ప్రాజెక్ట్ అంగీకరించడానికి కారణమేంటి?.. మొదటి హిందీ సినిమా సోలో హీరోగా చేయకుండా ఇలా ఎందుకు చేస్తున్నాడు?.. ఇలా ఎన్నో ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. ఆ ప్రశ్నలకు సమాధానంగా రకరకాల ప్రచారాలు జరుగుతూ వస్తున్నాయి. 'వార్-2'లో ఎన్టీఆర్ విలన్ రోల్ చేస్తున్నాడని, ఇది హీరో రోల్ ని డామినేట్ చేసేలా ఉంటుందని.. అంతేకాదు అసలు మొత్తం స్పై యూనివర్స్ కే ఎన్టీఆర్ విలన్ అని కూడా వార్తలు వినిపించాయి. అయితే ఆ ప్రచారంలో వాస్తవం లేదని.. అసలు ఎన్టీఆర్ ది విలన్ రోల్ కాదని తెలుస్తోంది.
యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, షారుఖ్ ఖాన్ ఎలాగైతే రా ఏజెంట్ లుగా కనిపిస్తున్నారో.. ఎన్టీఆర్ కూడా అలాగే ఒక పవర్ ఫుల్ ఇండియన్ రా ఏజెంట్ గా కనిపించనున్నాడట. 'వార్-2'లో హృతిక్, ఎన్టీఆర్ లు.. ఒకరు హీరో, ఒక విలన్ అని కాకుండా.. ఇద్దరూ హీరోలుగానే కనిపిస్తారట. ఈ ఇద్దరు కలిసి విలన్స్ ని ఎదుర్కొంటారట. అంటే ఇది కూడా 'ఆర్ఆర్ఆర్' సినిమా మాదిరిగా మల్టీస్టారర్ అన్నమాట.
ఇంకో విశేషం ఏంటంటే.. ఎన్టీఆర్ పాత్ర 'వార్-2' తోనే ముగిసిపోదట. ఈ సినిమాలో పవర్ ఫుల్ రా ఏజెంట్ గా ఎన్టీఆర్ పాత్రను పరిచయం చేసి.. స్పై యూనివర్స్ లో వచ్చే మిగతా సినిమాల్లో కంటిన్యూ చేస్తారట. అంటే హృతిక్ తో పాటు సల్మాన్, షారుఖ్ తో కూడా ఎన్టీఆర్ భవిష్యత్ లో స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడని అర్థమవుతోంది. అంతేకాదు 'వార్-2' తర్వాత.. ఎన్టీఆర్ సోలో హీరోగా కూడా ఒక సినిమా ఉంటుందట. ఇప్పటికే దీనికి సంబంధించి యష్ రాజ్ ఫిలిమ్స్ తో ఎన్టీఆర్ అగ్రిమెంట్ జరిగినట్లు సమాచారం. యష్ రాజ్ ఫిలిమ్స్ తో పాటు టి సిరీస్ వంటి పలు ప్రముఖ హిందీ నిర్మాణ సంస్థలు కూడా ఎన్టీఆర్ తో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయట. రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ ఎక్కువగా హిందీ సినిమాలు చేయడమో లేక తెలుగు-హిందీ ద్విభాషా చిత్రాలు చేయడమో జరిగే అవకాశముందని అంటున్నారు.
![]() |
![]() |