![]() |
![]() |

ఈ రోజు తెలుగు ప్రజల అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ పుట్టిన రోజు. ఇక ఈ పుట్టిన రోజు నుంచి ఆమె సినీ దశ తిరగబోతుంది. ఒక రకంగా తెలుగు సినిమా రంగానికి కాబోయే నెంబర్ వన్ హీరోయిన్ అని కూడా చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజులుగా ఆమెకి సంబంధించిన ఒక విషయంలో రూమర్స్ వస్తున్నాయి. ఇప్పుడు అవి నిజమయ్యాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.ఈ మూవీ ని మైత్రి మేకర్స్ నిర్మిస్తుంది. ఈ విషయం సినీ ప్రేమికులందరికి తెలుసు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఆ మూవీ తెరకెక్కబోతుంది. త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభం కానుంది . ఇందులో చెర్రీ కి జోడిగా జాన్వీ జతకట్టబోతుందనే వార్తలు గత కొన్ని రోజుల నుంచి ప్రముఖంగా వినిపిస్తూనే ఉన్నాయి.కానీ అధికారకంగా మాత్రం ఎవరు కన్ఫార్మ్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ వార్త నిజం అయ్యింది.మైత్రి మూవీ మేకర్స్ జాన్వీ కి జన్మదిన శుభాకాంక్షలు చెప్తు ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఇప్పుడు ఈ వార్త సినీ ప్రియుల్లో జోష్ ని నింపుతుంది.

ఇక మెగా ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు.ఎందుకంటే చిరు తన కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా, శ్రీదేవి ఎన్ని సినిమాలు చేసినా కూడా నేటికీ అందరు జగదేక వీరుడు అతిలోక సుందరి గురించే మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఆ ఇద్దరి వారసులు కలిసి స్క్రీన్ మీద మెరవబోవడంతో ఫ్యాన్స్ కి స్పెషల్ మూవీ గా నిలవడం ఖాయం. అలాగే శ్రీదేవి అభిమానులు కూడా తన తల్లి కూడా జాన్వీ కూడా తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ అవ్వాలని కోరుకుంటున్నారు. జాన్వీ ఇప్పుడు ఎన్టీఆర్ తో దేవర షూటింగ్ లో ఉంది.
![]() |
![]() |