![]() |
![]() |
.webp)
ఇటీవలే గీతామాధురి, నందు ఇంట బారసాల వేడుక ఘనంగా జరిగింది. రీసెంట్ గా గీతామాధురి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే . నందు-గీతామాధురి వాళ్ళ రెండో చిన్నారికి ‘ధృవధీర్ తారక్’ అని పేరు పెట్టారు. దీంతో అభిమానులు, నెటిజన్లు విషెస్ చెప్తున్నారు. బాబు పేరులో తారక్ అని అని ఉండటంతో ఎన్టీఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వేడుకకు బంధువులతో పాటు ఇండస్ట్రీ మిత్రులు కూడా హాజరయ్యారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి నటీనటులు , సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఇంకా కొంత మంది సెలబ్రిటీస్, బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ ఈ వేడుకకు హజరై శుభాకాంక్షలు తెలిపారు. గీతామాధురి బాలయ్యకు, ఎన్టీఆర్‌కి ఎంతో పెద్ద అభిమాని .
ఈ విషయం చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పింది. ఇక ఈ పేరు చూసిన నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. "కంగ్రాట్స్ గీత, నైస్ నేమ్ అని సాయికిరణ్ కామెంట్ చేశారు. పేరు చాలా బాగుంది అక్క అంటూ సింగర్ సౌజన్య, ఎక్సలెంట్ మీ అబ్బాయి ధ్రువ తార లాగా ఎప్పుడూ చిరంజీవి లా ఉండాలి అక్కా..దాక్షాయణి అక్క ఐనందుకు శుభాకాంక్షలు అని చెప్తున్నారు. రష్మీ, నిఖిల్, బుల్లితెర ఆర్టిస్టులు అంతా కూడా బారసాల వేడుకలో సందడి చేశారు. మంచి హస్కీ వాయిస్ తో టాలీవుడ్ లో సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న గీత మాధురి బిగ్ బాస్ 2 లో కూడా రన్నరప్ గా నిలిచింది. అలాగే నందు కూడా కొన్ని మూవీస్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలాగే విలన్ గా కూడా నటిస్తున్నారు. నందు రీసెంట్ గా వధువు అనే వెబ్ సిరీస్ నెగటివ్ రోల్ లో నటించాడు. అలాగే ఢీ లేటెస్ట్ సీజన్ కి యాంకర్ గా చేస్తున్నాడు. మరో వైపు స్పోర్ట్స్ ఛానల్ కి కూడా తన హోస్టింగ్ తో అదరగొడుతున్నాడు. ఇక వీళ్ళ జంటకు అందరూ శుభాకాంక్షలు చెప్తున్నారు.
![]() |
![]() |