![]() |
![]() |

స్టార్ హీరోయిన్ సమంత యాక్టింగ్ కెపాసిటీ గురించి అందరి తెలిసిందే. క్యారక్టర్ ఏదైనా సరే అందులోకి పరకాయ ప్రవేశం చెయ్యడం ఆమె స్టైల్. ఏ మాయ చేసావే నుంచి లేటెస్ట్ ఖుషి వరకు దాదాపు అందరి అగ్ర హీరోలతోను సినిమాలు చేస్తూనే ఉంది. హిందీ లోను తన సత్తా చాటుతు ఉంది. మూవీలో ఎంత పెద్ద హీరో అయినా కూడా తనకి మాత్రం ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అలాంటి సమంత ఒక హీరో గురించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.
లేటెస్ట్ గా సమంత ఒక కాలేజీ ఫంక్షన్ కి గెస్ట్ గా వెళ్ళింది. కొంత మంది విద్యార్థులు తనకి నటనలో ఇన్స్పిరేషన్ ఎవరని అడిగారు. దీంతో నాకు అల్లు అర్జున్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని తనే నాకు యాక్టింగ్ లో స్ఫూర్తి అని చెప్పింది.పైగా అల్లు అర్జున్ యాక్టింగ్ బీస్ట్ గా ట్రాన్స్ ఫార్మ్ అయ్యాడని కూడా చెప్పింది. అదే టైం లో బన్నీతో కలిసి నటించాలని ఉందని కూడా ఆమె చెప్పింది.ఇప్పుడు సమంత చెప్పిన ఈ మాటలు బన్నీ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ ని తెచ్చాయి.

ఇక సమంత బన్నీ లు సన్ అఫ్ సత్యమూర్తిలో జోడి కట్టారు.వాళ్ళిద్దరి ఫెయిర్ కి మంచి మార్కులు కూడా పడ్డాయి.అలాగేమూవీ మంచి విజయాన్ని కూడా సాధించింది. పుష్పలో కూడా సమంత ఒక ప్రత్యేక గీతంలో మెరిసింది. ఆ సాంగ్ పుష్ప విజయాన్ని మరింతగా పెంచిందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పుష్ప 2 లో కూడా ఒక స్పెషల్ సాంగ్ ఉంది.అది సమంత చేస్తే తెలుగు ప్రేక్షకులకి అంతకంటే అదృష్టం ఇంకోటి ఉండదు.
![]() |
![]() |