![]() |
![]() |

హీరో గోపీచంద్ నయా మూవీ భీమా.మహా శివరాత్రి కానుకగా ఈ నెల 8 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వబోతుంది. దీంతో ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. అందులో భాగంగా ఆ చిత్ర నిర్మాత వరుసగా ఇంటర్వ్యూ లు ఇస్తున్నారు .ఈ క్రమంలో ఆయన చెప్పిన ఒక న్యూస్ ఇప్పడు వైరల్ గా మారింది.
భీమాని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ అత్యంత భారీ వ్యయంతో నిర్మించాడు. గోపిచంద్ కెరీర్ లోనే హయ్యస్ట్ బడ్జట్ మూవీ కూడా ఇదే. తాజాగా ఆయన మాట్లాడుతూ భీమా చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తాయని నేను ఇప్పటికే మూడు సార్లు చూశానని చెప్పాడు. అలాగే చూసిన ప్రతిసారి గూస్ బంప్స్ వచ్చాయని చెప్పాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వార్తని చూసిన గోపి చంద్ ఫ్యాన్స్ అనందానికి అవధులు లేవు. మా హీరోకి ఒక భారీ హిట్ వచ్చినట్టే అని సంబరాలు చేసుకుంటున్నారు.

భీమాకి హర్ష దర్శకత్వాన్ని వహించాడు. ఈయన కన్నడంలో చాలా చిత్రాలకి దర్శకత్వాన్ని వహించాడు. తెలుగులో కొన్ని సినిమాల్లోని పాటలకి కొరియోగ్రఫీ ని కూడా అందించాడు. వాటిల్లో రవితేజ బెంగాల్ టైగర్ కూడా ఒకటి. కేజీఎఫ్, సలార్ లకి మ్యూజిక్ ని అందించిన రవి బస్రూర్ మ్యూజిక్ ని అందించాడు. దీంతో బిజిఎం ఒక లెవల్లో ఉండనుంది. గోపీచంద్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్ గా భీమా చరిత్ర కూడా సృష్టించబోతోంది. ఓటీటీ, శాటిలైట్ బిజినెస్ కూడా ఇప్పటికే క్లోజ్ అయ్యాయి. ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మ లు హీరోయిన్ లుగా చేస్తున్నారు
![]() |
![]() |