![]() |
![]() |

మెగాస్టార్ నయా మూవీ విశ్వంభర. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఎంతో ఆశతో ఎదురుచుస్తున్నారు. 2025 కి గాని వాళ్ల కోరిక నెరవేరదు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీలో ఒక వర్సటైల్ యాక్టర్ విలన్ గా చెయ్యబోతున్నాడు. ఇప్పుడు ఈ వార్త తెలుగు సినీ ప్రేమికులని ఆనందంలో ముంచెత్తుతుంది.
విశ్వంభర లో విలన్ గా రావు రమేష్ మెరవబోతున్నారు.పైగా ఆయనే మెయిన్ విలన్. అన్ని సోషల్ మీడియాల్లోను ఈ వార్త ప్రముఖంగా వినిపిస్తుంది.ఈ మేరకు చిత్ర బృందం నుంచి త్వరలోనే అధికార ప్రకటన రానుంది. చిరుని రావు రమేష్ డీ కొట్టబోతుండటంతో అందరిలోను విశ్వంభర ఆసక్తిని పెంచింది. పైగా మూవీలో రావు రమేష్ క్యారక్టర్ ఎలా ఉండబోతుందని కూడా చర్చించుకుంటున్నారు.వీటికంతటికి ఒక ముఖ్య వ్యక్తి కారణం. ఆయనే రావు రమేష్ తండ్రి దివంగత రావు గోపాలరావు గారు.గతంలో రావు గోపాలరావు గారు చిరంజీవి కాంబోలో లెక్కకు మించి సినిమాలు వచ్చాయి. నాయకుడు గా, ప్రతినాయకుడు గా ఆ ఇద్దరి కాంబో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.

ప్రేక్షకులు ఆ ఇద్దరి నట విన్యాసాన్ని చూడటానికే రిపీటెడ్ గా సినిమాకి వెళ్లే వాళ్ళు. ఎన్నో చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇప్పడు చిరు,రావు రమేష్ కాంబో కూడా హిట్ అవ్వాలని అందరు కోరుకుంటున్నారు. ఇక రావు రమేష్ కి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు.పైగా చిరంజీవి రావు రమేష్ కాంబోలో వస్తున్న మొట్టమొదటి మూవీ కూడా ఇదే. యు వి క్రియేషన్స్ పై వంశి ప్రమోద్ లు విశ్వంభర ని నిర్మిస్తున్నారు. బింబి సార వశిష్ట దర్శకత్వాన్ని వహిస్తున్నాడు. చిరు తో త్రిష జతకడుతుండగా ఇంకొంత మంది హీరోయిన్ లకి కూడా మూవీలో చోటు ఉంది. చోటా కె నాయుడు ఫొటోగ్రఫీ అందిస్తుండగా కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు. 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10 న మూవీ విడుదల కాబోతుంది
![]() |
![]() |