![]() |
![]() |

హీరోలతో పాటు సమానమైన క్రేజ్ ని సంపాదించిన నటీమణి నయనతార. ఎన్నో సంవత్సరాలనుంచి దక్షిణ భారతీయ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోయిన్ గా కూడా కొనసాగుతూ వస్తుంది. ఈ విషయంలో ఎవరికి ఎలాంటి డౌట్స్ లేవు.కానీ గత కొన్ని రోజులుగా నయన్ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాల మీద డౌట్ తో ఉన్నారు. ఈ నేపథ్యంలో విగ్నేష్ షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది.
నయన్ ఇనిస్టాగ్రమ్ లో విగ్నేష్ ని అన్ ఫాలో కొట్టింది.పైగా ఒక సాడ్ న్యూస్ కూడా పోస్ట్ చేసింది. దీంతో వాళ్లిదరు విడిపోతున్నారనే ప్రచారం గత కొన్ని రోజుల నుంచి వినిపిస్తుంది. తాజాగా విఘ్నేశ్ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసాడు.ఆ వీడియోలో నయన్ విగ్నేష్ ఒళ్ళో కూర్చొని ఉంది.ఆ ఇద్దరి పక్కనే ఒక ఫేమస్ ఫ్లూట్ మెన్ ఉన్నాడు.ఆయన తన వేణువుతో ఒక మధురమైన రాగాన్ని ప్లే చేస్తున్నాడు. దీంతో పరవశించి పోయిన నయన్ విగ్నేష్ ని ముద్దులతో ముంచెత్తుతుంది. ఇప్పడు ఈ వీడియో నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. ఇరువురి శ్రేయోబిలాషులు కూడా విగ్నేష్ ని మంచి పని చేసావని పొగుడుతున్నారు. ఈ వీడియో చూసిన వాళ్ళకి నయన్ విగ్నేష్ లు విడిపోతున్నారనే వార్త ఫేక్ అని అర్ధం అవుతుందని కూడా అంటున్నారు. కాకపోతే ఆ వీడియో పాతది అవ్వడం గమనార్హం.
నయన్,విగ్నేష్ లు ఏడేళ్ల పాటు ప్రేమించుకొని 2022లో పెళ్లి చేసుకున్నారు.సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకి కూడా జన్మనిచ్చారు. విగ్నేష్ చాలా ఇంటర్వూస్ లో నయన్ గురించి చాలా గొప్పగా చెప్తుంటాడు. విగ్నేష్ లాంటి భర్త దొరకడం తన అదృష్టమంటూ నయనతార కూడా పలు సందర్భాల్లో చెప్పింది. ఇక నయన్ తన ఇనిస్టా లో విగ్నేష్ ని అన్ ఫాలో కొట్టడం టెక్నీకల్ ఇష్యూ వల్ల వచ్చిన ప్రాబ్లం అని తెలుస్తుంది.
![]() |
![]() |