![]() |
![]() |
2024 సంవత్సరాన్ని ఓ ప్రభంజనంలా స్టార్ట్ చేసింది ‘హనుమాన్’ చిత్రం. రూ.40 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ.300 కోట్ల కలెక్షన్ సాధించి పెద్ద రికార్డు సృష్టించింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. జీ5లో మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా స్ట్రీమింగ్ మొదలుపెట్టబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈమధ్యకాలంలో విడుదలైన ఏ సినిమా కూడా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భాలు లేవు. స్టార్ హీరోల సినిమాలు సైతం 50 రోజుల వరకు వెళ్లడం లేదు. అలాంటిది ‘హనుమాన్’ 150 థియేటర్లలో అర్థ శథదినోత్సవాన్ని జరుపుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ ఈవెంట్‌ను నిర్వహించింది. ‘హనుమాన్’ చిత్రానికి సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ వుంటుందని ఇప్పటికే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.
‘హనుమాన్’ సక్సెస్ మీట్‌లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ ‘హనుమాన్ రీ మాప్టర్ వెర్షన్ రాబోతోంది. అది ఇంకా సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. ప్రశాంత్‌వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి వచ్చిన ఈ తొలి సినిమా.. చాలా పెద్ద యూనివర్స్‌కు పెద్ద హెల్ప్ కాబోతుంది. మా యూనివర్స్ నుండి మరిన్ని మంచి సినిమాలు రాబోతున్నాయి. ఇప్పుడు ‘హనుమాన్’ ఇంటర్నేషనల్ లెవల్లో రిలీజ్ కాబోతోంది. స్పెయిన్, జపాన్, చైనాకు చెందిన డిస్ట్రిబ్యూటర్లకు ఈ సినిమా బాగా నచ్చింది. ప్రస్తుతం వారితో డిస్కస్ చేస్తున్నాం. త్వరలోనే విదేశాల్లో మా సినిమా రిలీజ్ కాబోతోంది.
ఇక ‘జై హనుమాన్’ గురించి చెప్పాలంటే.. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయబోతున్నాం. ఈ సినిమాలో హనుమంతుడే హీరో. హనుమాన్‌లో క్లైమాక్స్ అందరికీ ఎంత నచ్చిందో.. అలాంటి ఎలిమెంట్స్‌తోనే రెండున్నర గంటల సినిమా వుండబోతోంది’ అని వివరించాడు ప్రశాంత్‌వర్మ. ఇప్పటికే రూ.300 కలెక్ట్ చేసిన ‘హనుమాన్’ ఇప్పుడు విదేశాల్లోని థియేటర్స్‌లో రిలీజ్ కాబోతోందంటే బిజినెస్‌పరంగా క్రేజ్ ఇంకా పెరిగిందనేది అర్థమవుతోంది. ఓ పక్క ఓటీటీలో రిలీజ్ అవుతుండగా, విదేశాల్లో కూడా రిలీజ్‌కి సిద్ధమైందంటే మొత్తానికి ‘హనుమాన్’ వెయ్యి కోట్లు కలెక్షన్ సాధించే దిశగా వెళుతోందని అర్థమవుతోంది.
![]() |
![]() |