![]() |
![]() |
.webp)
ఇండియాలో పుట్టడం నా కర్మ అంటూ చిన్మయి శ్రీపాద చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారింది. అసలెందుకు తను ఇలా అంది. ఏం జరిగిందో తెలుసుకుందాం.
కొన్ని రోజుల క్రితం అన్నపూర్ణమ్మ గారి ఇంటర్వ్యూ గురించి చిన్మయి చేసిన కామెంట్లు దుమారాన్ని రేపాయి. అయితే అది సర్దుమణిగిందనేలోపే ఇప్పుడు మరో వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ దేశంలో పుట్టడం నా కర్మ అంటు పోస్ట్ చేసింది. ఎందుకంటే తనకి నెగెటివ్ గా మాట్లాడుతూ, అబ్యూజింగ్ చేస్తున్నారని, పర్సనల్ గా చాలామంది మెసెజ్ లు చేస్తున్నారని చిన్మయి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ లు చేస్తోంది. కొంతమంది మాత్రం తనకి పాజిటివ్ గా స్పందిస్తున్నారు. మీరు చాలా స్ట్రాంగ్.. ఉన్నది ఉన్నట్టు మీకు నచ్చింది చేస్తున్నారు. మీలా ధైర్యంగా ఉండేవారు చాలా అరుదుగా ఉంటారంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
తనని ట్రోల్స్ చేస్తు చేసిన ఓ పోస్ట్ ని తన ఇన్ స్టాగ్రామ్ లో చెప్పింది చిన్మయి. మన దేశం ఆడవాళ్ళని పూజిస్తుందని ఆ పోస్ట్ లో ఉండగా.. వీళ్ళు ఆడవాళ్ళని పూజిస్తున్నారా? అంటు నవ్వింది. నేను మన దేశంలో ఆడవాళ్ళని కట్నం కోసం హింసించినవాళ్ళనే చూశానంటూ మరో సెటైరికల్ కామెంట్ చేసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి సుమారు 80 చిత్రాలకి పైనే చిన్మయి డబ్బింగ్ చెప్పింది. సమంతతో పాటు కాజల్, లావణ్య త్రిపాఠి, రకుల్ ప్రీత్ సింగ్, అనుపమ పరమేశ్వరన్, త్రిష లాంటి నటీమణులు ఆమె అందించిన స్వరంతోనే ప్రేక్షకులకి దగ్గరయ్యారు. రీసెంట్ గా సీతారామం, హాయ్ నాన్న ల్లో మృణాల్ కి కూడా తనే చెప్పింది. సింగర్ గాను లెక్కకు మించి ఎన్నో అధ్బుతమైన పాటలు పాడింది. అయితే ఆమె ప్రొఫెషన్ లో ఎంత సక్సెస్ అయిందో పర్సనల్ గా అంత విమర్శలని ఎదుర్కొంటుంది. అసలు తనేం పోస్ట్ చేసిన ఏదో ఒక వివాదం చెలరేగుతుంది. మరి ఇప్పుడు దేశం గురించి చేసిన వ్యాఖ్యలు మరింత నెట్టింట వాడీవాడీగా ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి.
![]() |
![]() |