![]() |
![]() |

గమ్యంతో సినీ రంగ ప్రవేశం చేసిన దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. వేదం,గౌతమీ పుత్ర శాత కర్ణి, కంచె, ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు లాంటి అధ్బుతమైన చిత్రాలు ఆయన నుంచి వచ్చాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో హరిహరవీరమల్లు ని తెరకెక్కిస్తున్నాడు.లేటెస్ట్ గా ఆయన మీద డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయి. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.
హైదరాబాద్ లో జరిగిన రాడిసన్ డ్రగ్స్ కేసులో పోలీసులు నన్ను కావాలని ఇరికించారని క్రిష్ చెప్పాడు.కేవలం వివేకానంద చెప్పడంతోనే ఎఫ్ఐఆర్ లో చేర్చారని కూడా ఆయన చెప్పాడు. నా డ్రైవర్ రాకపోవడం వల్ల హోటల్ లో అరగంట ఉన్నానని అతను వచ్చాక బయటకి వచ్చానని చెప్పాడు. అసలు వివేకానంద కూడా అప్పుడే పరిచయమని కూడా చెప్పాడు. పైగా నేను డ్రగ్స్ తీసున్నట్టు ఎటువంటి ఆధారాలు కూడా లేవని చెప్పుకొచ్చాడు.
ఇక గత కొన్ని రోజులుగా క్రిష్ పరారీలో ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం క్రిష్ హైకోర్టు లో అప్లై చెయ్యడం ప్రాధాన్యతని సంతరించుకుంది. కాకపోతే కోర్టు బెయిల్ అప్లికేషన్ ని సోమవారానికి వాయిదా వేసింది.ఈ నేపథ్యంలో క్రిష్ కి బెయిల్ వస్తుందా లేదా అనే క్యూరియాసిటీ అందరిలోను ఉంది. కాగా క్రిష్ ని పోలీసులు ఎనిమిదవ నిందితుడుగా చేర్చారు. వివేకానంద ఎవరో కాదు రాడిసన్ హోటల్ ఓనర్.
![]() |
![]() |