![]() |
![]() |

తెలుగునాట సినిమాలకి, రాజకీయాలకి మధ్య ఉన్న అనుబంధం ఈనాటిది కాదు.ఎన్నో దశాబ్దాల నుంచి పలువురు నటులు తమకి నచ్చిన రాజకీయ పార్టీ లో జాయిన్ అవుతు వస్తున్నారు. వాళ్ళ చేరిక ఆయా పొలిటికల్ పార్టీలకి ఎంతో కొంత లాభాన్ని కూడా చేకూరుస్తుంది. తాజాగా ఒక నటుడు తన పొలిటికల్ జర్నీని ప్రారంభించడం ఇప్పుడు ప్రాధాన్యతని సంతరించుకుంది.
ఈటీవీ లో ప్రసారమయ్యే కామెడీ షో జబర్దస్ ద్వారా స్మాల్ స్క్రీన్ పై మెరిసిన నటుడు కిరాక్ ఆర్పీ. ఎన్నో వందల ఎపిసోడ్స్ లో తన దైన స్టైల్ తో కామెడీ పండించి సొంతంగా అభిమానులని కూడా సంపాదించుకున్నాడు. ఈ నటుడు తాజాగా తెలుగుదేశం పార్టీలో చేరాడు.ఈ విషయాన్నీ ఆర్పీనే స్వయంగా చెప్పాడు. నెల్లూరులో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మీటింగ్ కి హాజరయిన ఆర్ పీ ఈ విషయాన్ని వెల్లడి చేసాడు.
జబర్దస్త్ కి రాక ముందు ఆర్పీ కొన్ని సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు. ప్రస్తుతం సినిమా నటుడుగాను రాణిస్తు ఉన్నాడు. కొంత మంది తమకి నచ్చిన పార్టీ లో చేరి సైలెంట్ గా ఉంటారు. మరి కొంతమంది ప్రచార బాధ్యతలని కూడా నిర్వహిస్తారు. మరి కిరాక్ ఆర్పీ తెలుగు దేశం తరుపున రాష్ట్రం మొత్తం తిరిగుతాడో లేదో చూడాలి. నెల్లూరు జిల్లా వాసి అయిన ఆర్పీ పూర్తి పేరు రాచకొండ ప్రసాద్. ఆయన భార్య పేరు లక్ష్మి ప్రసన్న.
![]() |
![]() |