![]() |
![]() |

ఆర్ఆర్ఆర్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.ప్రస్తుతం దేవరతో బిజీగా ఉన్నాడు. కానీ తన నెక్స్ట్ సినిమాకి సంబంధించిన పనుల్లో మాత్రం అస్సలు తగ్గడంలేదు. జెట్ స్పీడ్ తో ముందుకు వెళ్తున్నాడు.ఈ క్రమంలోనే ఇప్పుడు ఎన్టీఆర్ కి సంబంధించిన నయా పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
దేవర తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్నాడు.ఎన్టీఆర్ నటించే 31 వ చిత్రం ఇది.ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన పని మీద ఎన్టీఆర్ బెంగుళూర్ వెళ్ళాడు. కథా చర్చలు కూడా జరిగాయని తెలుస్తుంది. అనంతరం దర్శకుడు ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కొన్ని ఫోటోస్ దిగారు.అలా దిగి ఇలా సోషల్ మీడియాలో షేర్ చెయ్యగానే నెంబర్ ఆఫ్ వ్యూస్ తో ముందుకు దూసుకెళ్తున్నాయి. ఎన్టీఆర్ లుక్ ని చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. చెక్ షర్ట్ తో సింపుల్ గా ఉండి ఒక రేంజ్ లెవల్లో అదిరిపోయాడని అంటున్నారు.

ఇక వీళ్ళతో పాటు కాంతారా హీరో రిషబ్ శెట్టి కూడా ఫోటోస్ లో ఉన్నాడు. దీంతో రిషబ్ కూడా మూవీలో చేస్తున్నాడేమో అని అనుకుంటున్నారు. ఒక వేళ అదే జరిగితే ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు అవ్వడం ఖాయం అని కూడా అంటున్నారు. అలాగే ఆ ముగ్గురు తమ వైఫ్స్ తో కూడా కలిసి ఫొటోస్ దిగారు. మైత్రి మూవీ మేకర్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఎన్టీఆర్ 31 ని నిర్మిస్తున్నాయి.ఈ మూవీ మీద అందరిలోను భారీ అంచనాలే ఉన్నాయి. త్వరలోనే మరిన్ని విషయాలు తెలియనున్నాయి.
![]() |
![]() |