![]() |
![]() |

ఇప్పుడు అర్జున్ రెడ్డి కి ఒక హిట్ కావాలి. అదేనండి విజయ్ దేవరకొండ కి అర్జెంటుగా అదిరిపోయే హిట్ కావాలి. గత ఏడాది లైగర్, ఖుషి లతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ రెండు చిత్రాలు భారీ డిజాస్టర్స్ గా నిలిచాయి. దీంతో తన అప్ కమింగ్ మూవీ ఫ్యామిలీ స్టార్ మీదే విజయ్ ఆశలన్నీ ఉన్నాయి. తాజాగా ఆ మూవీకి సంబంధించిన ఒక నయా అప్ డేట్ ని విజయ్ తన అభిమానులతో పంచుకున్నాడు.
ఫ్యామిలీ స్టార్ నుంచి టీజర్ వస్తుంది అని విజయ్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. కొంచం సేపటి క్రితమే చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. కాకపోతే ఎప్పుడొస్తుందనే డేట్ ని మాత్రం చెప్పలేదు.పైగా టీజర్ వస్తుంది అని తెలుగుతో పాటు తమిళంలోను పోస్ట్ చేసాడు.ఏప్రిల్ 5 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న ఫ్యామిలీస్టార్ కోసం విజయ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకుల్లోను సినీ వర్గాల్లోను భారీ అంచనాలే ఉన్నాయి.

విజయ్ తో లేటెస్ట్ క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ జత కడుతుంది. దివ్యాన్ష కౌశిక్, అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తుండగా గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన నందనందన సాంగ్ యు ట్యూబ్ లో టాప్ 10 సాంగ్స్ లో ఒకటిగా దూసుకుపోతుంది. గోపి సుందర్, విజయ దేవరకొండ, పరశురామ్ కాంబోలో గతంలో వచ్చిన గీత గోవిందం పాటలు నేటికీ మారుమోగిపోతున్నాయి.
![]() |
![]() |